IND vs NZ 2nd Test: 255 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

పూణే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. మూడో రోజు తొలి సెషన్ లో న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 103 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు కివీస్ 359 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆట మరో 8 సెషన్ ల పాటు ఉడడంతో ఈ మ్యాచ్ లో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తుంది. 

5 వికెట్ల నష్టానికి 198 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ మూడో రోజు తొలి సెషన్ లో మరి 57 పరుగులు మాత్రమే జోడించగలిగింది. జడేజా చక చక వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్ ను త్వరగా ముగించాడు. బ్లండెల్ (48) సాంట్నర్ (4), అజాజ్ పటేల్ (1) లను ఔట్ చేసి భారత్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. సౌథీని అశ్విన్ డకౌట్ చేశాడు. చివరి వికెట్ రనౌట్ రూపంలో దక్కింది. ఫిలిప్స్ (48) ఒంటరి పోరాటం చేసి న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించాడు.         

భారత బౌలర్లలో సుందర్ నాలుగు వికెట్లు తీసుకోగా.. జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కు రెండు వికెట్లు దక్కాయి. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ కు 7 వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్స్ రెండు వికెట్లు దక్కగా.. సౌథీ ఒక వికెట్ తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది.