విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో నేడు శ్రీలంకతో ఇండియా ఢీ

  • రన్‌‌‌‌రేట్  పెంచుకోవడంపై హర్మన్‌‌‌‌సేన ఫోకస్‌‌‌‌
  • రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌, హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

దుబాయ్‌‌‌‌ :  ఓటమితో  టోర్నీని ఆరంభించి.. దాయాది పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై చెమటోడ్చి గట్టెక్కిన టీమిండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో మరో కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు సిద్ధమైంది.  గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో భాగంగా బుధవారం జరిగే పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఓ గెలుపు, మరో ఓటమితో ప్రస్తుతం హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్ సేన  రెండు పాయింట్లు, -మైనస్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌ (-–1.217) తో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ రేసులో  నిలవాలంటే లంకపై విజయంతో పాటు నెట్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవాల్సిన నేపథ్యంలో ఇండియా తన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ తడబాటును వెంటనే వీడాల్సిన అవసరం ఉంది. 

తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌పై రెండే రన్స్ చేసిన షెఫాలీ వర్మ పాక్‌‌‌‌‌‌‌‌పై 32 రన్స్‌‌‌‌‌‌‌‌తో  కాస్త టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది.  కానీ, రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ 12, 7 రన్స్‌‌‌‌‌‌‌‌తో స్టార్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన తీవ్రంగా నిరాశపరిచింది. తను వెంటనే ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడం అత్యవసరం. రన్‌‌‌‌‌‌‌‌రేట్ పెంచుకోవాలంటే ఓపెనర్లు షెఫాలీ, మంధాన దంచికొట్టాల్సిందే. రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 15, 29 స్కోర్లు చేసిన  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ పాక్‌‌‌‌‌‌‌‌పై బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తుండగా మెడ గాయానికి గురైంది. తను ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉందని వైస్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మంధాన తెలిపింది. 

ఒకవేళ హర్మన్‌‌‌‌‌‌‌‌ ఆటకు దూరమైతే  జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మతో పాటు యంగ్‌‌‌‌‌‌‌‌ కీపర్ రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది.  పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై మూడు వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ కీలకం కానుంది. మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తనకు తోటి పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌, గాయం కారణంగా గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సపోర్ట్ అవసరం. స్పిన్‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఇండియా ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సీనియర్ ప్లేయర్ దీప్తి శర్మ తన స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయడం లేదు. 

లంకపై అయినా ఆమె గాడిలో పడుతుందేమో చూడాలి. యంగ్ ఆఫ్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేయాంక పాటిల్‌‌‌‌‌‌‌‌, లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్ ఆశ శోభన వికెట్లు పడగొట్టడంతో పాటు రన్స్ నియంత్రిస్తూ ఆకట్టుకుంటున్నారు. దీప్తి కూడా టచ్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ పదునెక్కుతుంది.  ఈ నెల 13న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో ఆస్ట్రేలియాతో ఇండియా చావోరేవో తేల్చుకోనుంది. ఈ  నేపథ్యంలో శ్రీలంకపై భారీ విజయం సాధిస్తే రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్లేయర్ల  ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 

ఒత్తిడిలో లంక అమ్మాయిలు

టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓడిన శ్రీలంక గ్రూప్ లో చివరి ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సెమీస్ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. టీ20ల్లో ఆ జట్టుపై ఇండియాకు 19–5తో మంచి రికార్డు ఉంది. కానీ, ఆగస్టులో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను లంక ఓడించింది. దాంతో  లంక ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆ టీమ్‌‌‌‌ను తక్కువగా అంచనా వేయడాలనికి లేదు.  ఆ జట్టుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాగా, సాయంత్రం జరిగే గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో సౌతాఫ్రికా, స్కాట్లాండ్ పోటీపడతాయి.