హాంకాంగ్ సిక్స్‌స్ టోర్నీ 2024 టీమిండియాకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. రాబిన్ ఉతప్ప కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు ఓటములను మూటగట్టుకుంది. తొలి రోజు దాయాది పాకిస్థాన్, పసికూన యూఏఈ చేతిలో భంగపోయిన భారత జట్టు.. రెండో రోజూ ఇంగ్లాండ్ చేతిలో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఓటమిపాలైంది. తాజాగా న్యూజిలాండ్ తోనూ 44 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.
శుక్రవారం (నవంబర్ 1) టిన్ క్వాంగ్ రోడ్ క్రికెట్ గ్రౌండ్‌లో దాయాధి పాకిస్థాన్ పై భారత్ భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పాకిస్థాన్ ఛేజ్ చేసింది. అసిఫ్ అలీ 14 బంతుల్లో 55 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తర్వాత యూఏఈ పై మన జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోయి 120 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 105 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే ఆడిన మూడింట ఓటమిపాలైన భారత్.. టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ 44 పరుగులతో ఓటమి తప్పలేదు.
India ?? in Honk Kong Sixes 2024 ? pic.twitter.com/qki6ZHPlSU
— CricketGully (@thecricketgully) November 2, 2024