ఇండియాకు షాక్‌‌‌‌ .. 9 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

  • హర్మన్‌‌‌‌ప్రీత్  ఫిఫ్టీ వృథా సెమీస్‌‌‌‌కు కంగారూ టీమ్‌‌‌‌

షార్జా: టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా బలమైన ఆస్ట్రేలియా అడ్డును దాటలేకపోయింది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్ 9  రన్స్ తేడాతో ఇండియాను ఓడించింది. వరుసగా నాలుగో విక్టరీతో గ్రూప్ టాపర్‌‌‌‌‌‌‌‌గా సెమీస్ చేరింది. తొలుత ఆసీస్‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 151/8  స్కోరు చేసింది. గ్రేస్​హారిస్‌‌‌‌ (40), తహ్లియా మెక్‌‌‌‌గ్రాత్ (32), ఎలైస్ పెర్రీ (32) రాణించారు. రేణుకా సింగ్ (2/24), దీప్తి శర్మ (2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌లో ఇండియా ఓవర్లన్నీ ఆడి  142/9  స్కోరు చేసి ఓడింది. కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ ( 47 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 54 నాటౌట్‌‌‌‌), దీప్తి శర్మ (29) పోరాడారు.  ఆసీస్‌‌‌‌ బౌలర్లలో ప్లేయర్‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్‌‌  మొలినుక్స్, సదర్లాండ్‌‌‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

ఆసీస్ ధాటిగా

టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు ఇండియా పేసర్‌‌‌‌‌‌‌‌ రేణుకా సింగ్ ఆరంభంలోనే షాకిచ్చింది. ఇనింగ్స్‌‌‌‌ మూడో ఓవర్లో వరుస బాల్స్‌‌‌‌లో ఓపెనర్ బెత్ మూనీ (2), జార్జియా వారెహమ్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌ చేర్చింది. కానీ, మరో ఓపెనర్ గ్రేస్‌‌‌‌, కెప్టెన్ తహ్లియా మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దారు.  ఈ ఇద్దరూ మూడో వికెట్‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌ జోడించారు. ఇండియా ఫీల్డర్లు పలు క్యాచ్‌‌‌‌లు చేజార్చడం కూడా వీరికి కలిసొచ్చింది. చివరకు రాధా యాదవ్ బౌలింగ్‌‌‌‌లో తహ్లియా స్టంపౌట్ అవ్వడంతో ఇండియాకు మరో బ్రేక్ లభించింది. అరుంధతి బౌలింగ్‌‌‌‌లో రెండు ఫోర్లు కొట్టిన హారిస్‌‌‌‌.. దీప్తి బౌలింగ్‌‌‌‌లో మంధానకు చిక్కింది. ఇక్కడి నుంచి ఆసీస్‌‌‌‌ బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఎలైస్‌‌‌‌ పెర్రీ ధాటిగా ఆడింది. చివర్లో లిచ్‌‌‌‌ఫెల్డ్‌‌‌‌ (15 నాటౌట్‌‌‌‌), సదర్లాండ్ (10) పోరాటంతో ఆసీస్‌‌‌‌ 150 మార్కు దాటింది. 

హర్మన్ పోరాడినా

ఛేజింగ్‌‌‌‌లో ఇండియా షెఫాలీ వర్మ (20)  మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేసినా మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన (6) ఆకట్టుకోలేకపోయింది. వెంటవెంటనే రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో అలరించిన షెఫాలీని నాలుగో ఓవర్లో గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌ చేర్చింది. ఆపైమొలినుక్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో మంధాన ఎల్బీగా ఔటవగా... మూడు ఫోర్లతో జోరు మీద కనిపించిన జెమీమా రోడ్రిగ్స్ (16)ను మేగన్‌‌‌‌ షుట్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేసింది. దాంతో 47/3తో ఇబ్బందుల్లో పడ్డ జట్టును కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌, దీప్తి శర్మ ఆదుకున్నారు. క్రీజులో కుదురుకున్న తర్వాత ఇద్దరూ అద్భుతమైన షాట్లతో బౌండ్రీలు రాట్టి స్కోరు వంద దాటించారు. 

16వ ఓవర్లో భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసిన దీప్తి..వారెహమ్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 63 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్లో రిచా ఘోశ్ (1) రనౌటై ఒకే రన్‌‌‌‌ రావడంతో మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. చివరి మూడు ఓవర్లలో ఇండియాకు 40 రన్స్ అవసరం అవగా.. గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో హర్మన్‌‌‌‌ వరుసగా రెండు ఫోర్లు సహా 12 రాబట్టి జట్టును రేసులోకి తెచ్చింది. 19వ ఓవర్లో వస్త్రాకర్ (9), హర్మన్ చెరో ఫోర్ కొట్టారు. చివరి ఓవర్లో 14 రన్స్ అవసరం అవగా.. నాలుగు వికెట్లు కోల్పోయి నాలుగే రన్స్‌‌‌‌ రావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. 

నేడు పాక్ గెలిస్తే.. ఇండియా ముందుకు!

ఈ మ్యాచ్‌‌లో ఓడినా గ్రూప్‌‌‌‌–ఎలో  మెరుగైన రన్ రేట్‌‌తో ఇండియా (+0322) రెండో ప్లేస్‌‌లో ఉంది.  సోమవారం జరిగే  మ్యాచ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ (–0.488)పై నెగ్గితే న్యూజిలాండ్‌‌‌‌ (0.282) నేరుగా సెమీస్‌‌‌‌ చేరుతుంది. ఒకవేళ పాక్ చిన్న తేడాతో గెలిస్తే.. ఆ జట్టుతో పాటు ఇండియా, కివీస్‌‌‌‌ తలో 4 పాయింట్లతో నిలుస్తాయి. మెరుగైన రన్‌‌‌‌రేట్‌‌‌‌ ఉన్న ఇండియా ముందుకెళ్తుంది. పాక్‌‌ సెమీస్ చేరాలంటే కనీసం 150 స్కోరు చేసి 53 రన్స్‌‌ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 151/8 (హారిస్ 40, తహ్లియా 32, పెర్రీ 32, రేణుక 2/24).ఇండియా: 20 ఓవర్లలో 142/9  (హర్మన్‌‌‌‌  54 నాటౌట్‌‌‌‌, దీప్తి 29, సదర్లాండ్ 2/22)