IND vs AUS: 400 పరుగులు దాటిన భారత్ ఆధిక్యం.. ఆసీస్‌కు టెన్షన్ టెన్షన్

పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతుంది. ఓపెనర్లు అద్భుత ఆట తీరుకు తోడు కోహ్లీ రాణించడంతో  టీమిండియా భారీ ఆధిక్యం దిశగా వెళ్తుంది. రెండో రోజు ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ ఇచ్చిన భారీ భాగస్వామ్యంతో మూడో రోజు కూడా భారత్ అదే ఆట తీరును నిలకడగా ఆడుతుంది. తొలి రెండు సెషన్స్ లో మరో 187 పరుగులు రాబట్టుకొని ఆధిక్యాన్ని నాలుగు వందలు దాటించారు. 

మూడో రోజు టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ 5 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (39), సుందర్ (6) ఉన్నారు. భారత్ ఆధిక్యం ప్రస్తుతం 405 పరుగులకు చేరింది. క్రీజ్ లో కోహ్లీ (40), సుందర్ (14) ఉన్నారు. వికెట్ నష్టానికి 275 పరుగులతో రెండో సెషన్ ఆరంభించిన భారత్.. ప్రారంభంలోనే పడికల్ (25) వికెట్ ను కోల్పోయింది. జోరు మీదున్న జైశ్వాల్ 161 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. పంత్, జురెల్ ఇలా వచ్చి అలా వెళ్లడంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. 

ఈ దశలో సీనియర్ కోహ్లీ.. ఆల్ రౌండర్ సుందర్ తో కీలక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 38 పరుగులు జోడించి టీ విరామ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, హేజల్ వుడ్, కమ్మిన్స్, లియాన్, మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది.