ముంబై టెస్టులో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బ్యాటింగ్ లో మరోసారి విఫలమైంది. రెండో రోజు గిల్, పంత్ భాగస్వామ్యం మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. చివర్లో సుందర్ మెరుపులు మెరిపించడంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత్ తరపున 90 పరుగులు చేసి గిల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంత్ 60 పరుగులతో రాణించాడు.
5 వికెట్ల నష్టానికి 195 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్.. మరో 68 పరుగులు చేసి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. ప్రారంభంలోనే జడేజా(14) ఔటయ్యాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ డకౌటయ్యాడు. ఈ దశలో గిల్, సుందర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. 23 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నారు. ఈ దశలో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న గిల్ ను అజాజ్ పటేల్ పెవిలియన్ కు చేర్చాడు. అశ్విన్ 6 పరుగులు చేసి ఔట్ కాగా.. చివర్లో సుందర్ మెరుపులతో భారత్ ఆధిక్యాన్ని సంపాదించింది.
Also Read : భారత జట్టుపై గంభీర్ ప్రయోగాలు
38 పరుగులు చేసి సుందర్ అజేయంగా నిలిచాడు. రనౌట్ రూపంలో ఆకాష్ దీప్ వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. హెన్రీ, సోధీ, ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.
The match is moving fast, as India take a slender lead ?
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2024
? https://t.co/Vq9uHVazcz | #INDvNZ pic.twitter.com/rAA5C6DdeA