న్యూఢిల్లీ: దేశంలో వరదల వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందే అప్రమత్తం చేయడానికి.. ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి 'ఫ్లడ్‌వాచ్' అనే యాప్‌ను ప్రారంభించింది. ఈమేరకు గురువారం సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్లూసీ) చైర్ పర్సన్ కుష్విందర్ వోహ్రా ఫ్లడ్‌వాచ్' యాప్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 338 స్టేషన్ల నుంచి వరద అప్‌డేట్స్ సేకరిస్తుందని అన్నారు.
మొబైల్ ఫోన్‌ల ద్వారా వరదల గురించి ప్రజలను అలర్ట్ చేయడంతోపాటు బాధితులకు వారం పాటు సూచనలను అందిస్తుందని చెప్పారు. వరదను కచ్చితంగా అంచనా వేయడానికి యాప్‌లో శాటిలైట్ డేటా అనాలసిస్, మ్యాథమేటిక్ మోడలింగ్ వంటి అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఉపయోగించినట్లు వివరించారు. 'ఫ్లడ్‌వాచ్' యాప్ టెక్స్ట్, ఆడియో ఫార్మాట్‌లలో అలర్ట్ మెసేజేస్ పంపుతుందని తెలిపారు. ఈ యాప్ ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీలోనే ఉందని.. త్వరలో ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెస్తామని స్పష్టంచేశారు.
