IND vs SA 4th T20: ఇండియా బ్యాటింగ్..మార్పులు లేకుండానే ఇరు జట్లు

జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్లు నాలుగో టీ 20 ఆడేందుకు సిద్ధమయ్యాయి. వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం (నవంబర్ 15) జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. 

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా మూడో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా అద్భుత విజయాన్ని సాధించి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకుంటుంది. మరోవైపు సౌతాఫ్రికాపై సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది.  టీ20 లో గెలిస్తే సిరీస్ సమం చేసుకోగలుగుతుంది.

ALSO READ | Champions Trophy 2025: భారత్‌కు ఐసీసీ బిగ్ షాక్.. సరైన కారణం చేబితేనే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్ ), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండిలే సిమెలనే, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా

భారత్ (ప్లేయింగ్ XI):

సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి