IND vs BAN 2024: ఉప్పల్‌లో మ్యాచ్.. టీమిండియా బ్యాటింగ్

భారత్, బంగ్లాదేశ్ మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి టీ20 ప్రారంభమైంది. ఉప్పల్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. మరో వైపు కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ చూస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ కు అర్షదీప్ కు రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని తుది జట్టులో తీసుకున్నారు.

భారత్ (ప్లేయింగ్ XI):

సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):

పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(w), నజ్ముల్ హొస్సేన్ శాంటో(c), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్