IND vs BAN 2nd Test: 34.4 ఓవర్లకే భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్.. రసవత్తరంగా కాన్పూర్ టెస్ట్

కాన్పూర్ టెస్ట్ శర వేగంగా సాగుతుంది. డ్రా ఖాయమన్న టెస్టులో భారత్ గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతుంది. వేగంగా ఆడే  క్రమంలో కేవలం 35 ఓవర్లలోపే ఇన్నింగ్స్ ముగించారు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన భారత్ 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యం లభించింది. 51 బంతుల్లోనే 72 పరుగులు చేసి జైశ్వాల్  టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ 68 పరుగులు చేసి భారత్ కు వేగంగా ఆధిక్యాన్ని అందించాడు. కోహ్లీ (47), గిల్ (39) రాణించారు.

2 వికెట్లకు 137 పరుల వద్ద చివరి సెషన్ ప్రారంభించిన భారత్ ప్రారంభంలోనే గిల్ వికెట్ కోల్పోయింది. కాసేపటికే పంత్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో రాహుల్, కోహ్లీ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఓ విప్పు వేగంగా ఆడుతూనే మరోవైపు వికెట్ ను కాపాడుకున్నారు. 5 వికెట్ కు 87 పరుగులు జోడించిన తర్వాత కోహ్లీ 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ నుంచి భారత్ వేగంగా వికెట్లను కోల్పోయింది. 9 వ వికెట్ పడిన కాసేపటికి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. 

ALSO READ | IND vs BAN 2nd Test: విరాట్‌ను వరించిన అదృష్టం..కోహ్లీని హత్తుకొని పంత్ క్షమాపణలు

నాలుగో రోజు 19 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఐదో రోజు 98 ఓవర్ల పాటు ఆట జరుగుతుంది. బంగ్లాదేశ్ ను 200 పరుగుల లోపు ఆలౌట్ చేస్తే టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించవచ్చు. భారత బౌలర్లు ఎంత తక్కువగా బంగ్లాను ఆలౌట్ చేస్తారనే దానిపైనా భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.