పాక్‎ చిత్తు.. అండర్‌‌‌‌‌‌‌‌–19 విమెన్స్‌ ఆసియా టీ20 కప్‌‌‌‌‌‌‌‌లో భారత్ బోణీ

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా అమ్మాయిలు.. అండర్‌‌‌‌‌‌‌‌–19 విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా టీ20 కప్‌‌‌‌‌‌‌‌లో బోణీ కొట్టారు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో కమిలిని (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 44 నాటౌట్‌‌‌‌‌‌‌‌), బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సోనమ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (4/6) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎ తొలి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన పాక్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 67/7 స్కోరు చేసింది. కోమల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (24) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఫాతిమా ఖాన్‌‌‌‌‌‌‌‌ (11) ఫర్వాలేదనిపించినా.. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కు పరిమితమయ్యారు.

తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 7.5 ఓవర్లలోనే 68/1 స్కోరు చేసి నెగ్గింది. తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ గొంగడి త్రిష (0) డకౌటైనా.. కమిలిని, సానికా చాల్కే (19 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మరో 73 మిగిలి ఉండగానే ఈజీగా విజయాన్ని అందించారు. కమిలినికి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక విమెన్స్‌‌‌‌‌‌‌‌ 94 రన్స్‌‌‌‌‌‌‌‌తో మలేసియాపై గెలిచింది. లంక 153/4 స్కోరు చేయగా, మలేసియా 59/6 స్కోరుకే పరిమితమైంది.