ఉగాండాకు 36 వాహనాలను బహుమతిచ్చిన భారత్‌

ఉగాండాకు 36 వాహనాలను బహుమతిచ్చిన భారత్‌

భారత్‌… ఉగాండాకు 36 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. 2018 జూలైలో ప్రధాని మోడీ ఉగాండాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ పౌరులు, సైనికుల అవసరాల కోసం వాహనాలను గిఫ్ట్ గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని భారత్‌ ఇప్పుడు నెరవేర్చింది. ఉగాండాకు 36 వాహనాలను ఉచితంగా అందజేసింది. వీటిని అందుకున్న ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అడాల్ఫ్ మ్వేసిగేకి భారత్ ఉన్నతిని కొనియాడారు. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. 36 వాహనాలల్లో 10 బస్సులు, 10 సైనికులను తరలించే వాహనాలు, రెండు అంబులెన్స్‌లు, 14 మోటార్ బైక్‌లు ఉన్నాయి. ఈ నెల 24న కంపాలాలో జరిగిన కార్యక్రమంలో ఉగాండాలోని భారత రాయబారి ఏ అజయ్ కుమార్, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అడాల్ఫ్ మ్వేసిగేకి వీటిపి అందజేశారు. భారత్ సహాయానికి ఉగాండా కృతజ్ఞతలు తెలిపింది.