సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ బ్యాటింగ్ లో అద్భుత ఆట తీరును కనబర్చింది. సౌతాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ భారీ స్కోర్ చేశారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సూపర్ సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. 56 బంతుల్లో 107 పరుగులు చేసిన తిలక్ వర్మ భారత్ తరపున టాప్ స్కోరర్. అతని ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు,8 ఫోర్లున్నాయి.
టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. సంజు శాంసన్ పరుగులేమీ చేయకుండా డకౌటయ్యాడు. ఈ దశలో తిలక్ వర్మతో కలిసిన అభిషేక్ శర్మ సౌతాఫ్రికా బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. బౌండరీల వర్షం కురిపిస్తూ సఫారీ బౌలర్లను చిత్తుగా కొట్టారు. వీరిద్దరూ 50 బంతుల్లోనే 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పటిష్ట స్థితికి చేర్చారు. హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ (50), సూర్య కుమార్ యాదవ్ (1) హార్దిక్ పాండ్య (18) స్వల్ప వ్యవధిలోనే ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ నెమ్మదించింది.
ALSO READ | Ranji Trophy 2024-25: సచిన్ కొడుకు అదరహో.. 5 వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండూల్కర్
ఒక వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో తిలక్ వర్మ బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో 51 బంతుల్లో అంతర్జాతీయ టీ 20ల్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో రమణ్ దీప్ సింగ్ (15) బ్యాట్ ఝళిపించడంతో సౌతాఫ్రికా ముందు భారత్ 220 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మార్కో జాన్సెన్ కు ఒక వికెట్ లభించింది.
Tilak Varma's smashing hundred takes India to a big score ?
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2024
? https://t.co/5vv6hE57z0 | #SAvIND pic.twitter.com/wNnHcnvQvk