బ్రిటన్​ విమానాలు జనవరి 7వరకు బంద్​

బ్రిటన్​ విమానాలు జనవరి 7వరకు బంద్​
UKలో కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో బ్రిటన్ నుంచి వచ్చే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే విమాన సర్వీసుల రద్దును కేంద్రం పొడిగించింది. 2021 జనవరి 7 వరకు రాకపోకలను నిలిపేస్తూ ఇవాళ(బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఉత్తర్వులను జారీ చేశారు. జనవరి 7 తర్వాత కఠినమైన ఆంక్షల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే… పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతినివ్వాలని సూచించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఆరోగ్య శాఖతో చర్చించి పౌర విమానయాన శాఖ ఖరారు చేస్తుందని తెలిపారు. మరోవైపు..అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాల రాకపోకలు పై జనవరి 31 వరకు నిషేధం విధించింది DGCA. కరోనా క్రమంలో జూన్ 26న విడుదల చేసిన మార్గదర్శకాలను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కార్గో విమానాలకు నిషేధం మినహాయింపునిచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తు అనుమతితో నిర్దేశిత మార్గాల్లో విమానాలు నడిపేందుకు మాత్రమే అనుమతించింది.