దేశంలో 95 కోట్ల డోసులు కంప్లీట్

దేశంలో 95 కోట్ల డోసులు కంప్లీట్

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడ్‌‌గా సాగుతోంది. ఆదివారం రోజు రాత్రి 7 గంటల సమయానికి 44 లక్షలకు పైగా మందికి కరోనా టీకాలు వేయగా.. దేశవ్యాప్తంగా మొత్తం 95 కోట్ల డోసులకుపైగా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. రాత్రి 7 తర్వాత జరిగిన వ్యాక్సినేషన్ వివరాలు ఇంకా నమోదు కాలేదని తెలిపింది. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 8.28 కోట్లకుపైగా డోసుల టీకాలు ఉన్నాయని పేర్కొంది. ఇక, శనివారం 66.85 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఫుల్ స్వింగ్‌‌లో ఉందని కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్‌‌సుఖ్ మాండవీయ ట్విట్టర్‌‌లో తెలిపారు. త్వరలోనే 100 కోట్ల డోసుల టార్గెట్ ను చేరే అవకాశం ఉందన్నారు.  ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఫుల్ స్వింగ్‌‌లో ఉంది. ఇండియా 95 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేసింది. నూరు కోట్ల డోసుల దిశగా దూసుకెళ్తోంది. త్వరగా టీకా తీసుకోండి. మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు వేయించండి” అని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న హెల్త్ వర్కర్లతో ప్రారంభమైంది. ఫిబ్రవరి 2న ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు షురూ అయ్యాయి. మార్చి 1 నుంచి 60 ఏండ్లు దాటినోళ్లకు, 45 ఏండ్లు దాటిన కోమార్బిడ్ వాళ్లకు, ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడినోళ్లకు టీకాలు వేశారు. మే 1 నుంచి 18 ఏండ్లు నిండినోళ్లందరికీ వ్యాక్సిన్ లు ప్రారంభించారు.