ఫ్యామిలీతో కలిసి స్వదేశానికి గంభీర్‌‌‌‌‌‌‌‌

పెర్త్‌‌‌‌: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌‌‌‌‌‌‌ స్వదేశానికి పయనం అయ్యాడు. పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా ఫ్యామిలీతో కలిసి ఇండియా వస్తున్నాడు. 

 దాంతో ఈ నెల 30 నుంచి  కాన్‌‌‌‌బెరాలో ఆస్ట్రేలియా ప్రైమ్‌‌‌‌ మినిస్టర్స్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌తో  ఇండియా ఆడే పింక్‌‌‌‌ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌‌‌‌కు దూరంగా ఉండనున్నాడు. డిసెంబర్ 6న మొదలయ్యే రెండో టెస్టు నాటికి గంభీర్ తిరిగి జట్టుకు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ అధికారి తెలిపారు. మరోవైపు టీమిండియా బుధవారం కాన్‌‌‌‌బెరా వెళ్లనుంది. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చే అధికారిక విందుకు హాజరుకానుంది.