ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరుగుల ఉప్పెన .. 133 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో బంగ్లాపై గెలుపు

  • భారీ స్కోరుతో ఇండియా రికార్డు
  • సెంచరీతో మెరిసిన శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • 3-0తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: భాగ్యనగర గడ్డపై దసరా పండుగ వేళ టీమిండియా రికార్డుల పండుగ చేసుకుంది. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దంచికొడుతూ  ఉప్పల్‌‌లో పరుగుల ఉప్పెన చూపెట్టింది. సంజు శాంసన్ (47 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111) కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి  సెంచరీకి తోడు సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 75) దంచికొట్టడంతో టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా తమ అత్యధిక, ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రెండో హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు సాధించింది. దాంతో శనివారం జరిగిన మూడో టీ20లో ఇండియా 133 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 3–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. 

తొలుత ఇండియా  20 ఓవర్లలో 297/6 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (18 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 7), రియాన్ పరాగ్ (13 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 4 సిక్సర్లతో 34) కూడా రాణించారు. తంజిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 164/7 స్కోరు మాత్రమే చేసింది.తౌహిద్ హృదయ్ (63 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), లిటన్ దాస్ (42) ఆకట్టుకున్నారు. ఇండియా బౌలర్లలో రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు, మాయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డులు లభించాయి.

దంచుడే దంచుడు

గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పల్‌‌లో మాత్రం విజృంభించాడు.  టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వెంటనే ఓపెనర్ అభిషేక్ శర్మ (4) తంజిమ్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరిగ్గా పుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేక ఔటయ్యాడు. కానీ, వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన సూర్య,  శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్లు, సిక్సర్లు కొట్టడంలో పోటీ పడ్డారు. ఆరో ఓవర్లో సూర్య వరుసగా 4, 4, 4, 6 బాదడంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేను ఇండియా 82/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత ఈ ఇద్దరి బాదుడులో ఏమాత్రం తేడా రాలేదు. రిషద్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా 4, 4, 6 కొట్టిన శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రిషద్ వేసిన పదో ఓవర్లో శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా ఐదు సిక్సర్లతో రెచ్చిపోవడంతో స్టేడియం హోరెత్తింది. 

సగం ఓవర్లకే స్కోరు 150 దాటింది. 23 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ దాటిన సూర్య మరో రెండు సిక్సర్లు రాబట్టగా.. మెహిదీ హసన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శాంసన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరూ ఔటైనా.. అప్పటికే స్కోరు 200 దాటింది. కొత్తగా క్రీజులోకి వచ్చిన పరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హార్దిక్ స్లాగ్ ఓవర్లలో పరుగుల వేట కొనసాగించారు. తంజిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన 16వ  ఓవర్లో హార్దిక్ వరుసగా 4, 6, 6, 4 కొడితే...  ఆవెంటనే మెహిదీ హసన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరాగ్ 6, 4, 6తో తన బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టాడు. వీళ్ల జోరు చూస్తుంటే ఇండియా ఈజీగా 300 మార్కు దాటి అత్యధిక స్కోరు రికార్డు చేసేలా కనిపించింది. కానీ, 19వ ఓవర్లో పరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తస్కిన్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా.. తంజిమ్ వేసిన  చివరి ఓవర్లో సిక్స్ కొట్టిన వెంటనే హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి (0) ఔటయ్యారు. చివరి రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుందర్ (1 నాటౌట్‌‌) సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్ (8 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టినా 300 మార్కుకు ఇండియా 3 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరంలో నిలిచిపోయింది. 

బంగ్లా పోరాటం సరిపోలే 

గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పోలిస్తే బంగ్లా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంచెం మెరుగైనా కొండంత టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయింది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఓపెనర్ పర్వేజ్ (0)ను గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డకౌట్ చేసిన స్పీడ్ స్టర్ మయాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన తంజిద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హసన్ (15)ను సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్ నజ్ముల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంటో (14)ను బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనక్కుపంపడంతో పవర్ ప్లేలో బంగ్లా 59/3తో నిలిచింది. ఈ దశలో లిటన్ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తౌహిద్ హృదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగంగా ఆడుతూ  స్కోరు వంద దాటించారు. అయితే, 12వ ఓవర్లో లిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌ చేయగా... మహ్ముదుల్లా (8), మెహిదీ హసన్ (3), రిషద్ (0) నిరాశ పరచడంతో బంగ్లాకు భారీ ఓటమి తప్పలేదు. 

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్కోరు ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండో అత్యధికం.  గతేడాది ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో మంగోలియాపై నేపాల్‌‌‌‌‌‌‌‌ 314/3 స్కోరు చేసింది. ఐసీసీ శాశ్వత సభ్య దేశాలు తలపడిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్కోరు అత్యధికం.

శాంసన్ సెంచరీకి అవసరమైన బాల్స్‌‌‌‌‌‌‌‌. రోహిత్ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌) తర్వాత టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేసిన ఇండియన్‌‌గా నిలిచాడు. 

ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో  ఫోర్లు, సిక్సర్లతోనే వచ్చిన రన్స్‌‌‌‌‌‌‌‌. మెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20లో ఓ టీమ్‌‌‌‌‌‌‌‌కు అత్యధికం. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 297/6 (శాంసన్ 111, సూర్య 75, తంజిమ్ 3/66).బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 164/7  (తౌహిద్ 63, లిటన్ 42, బిష్ణోయ్ 3/30, మయాంక్ 2/32)