లండన్ లోని లీడ్స్ హెడెంగ్లీలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి దిగిన లంక భారత్ కు 265 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భారత్ 3 వికెట్ల నష్టానికి 43.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 103, కెఎల్ రాహుల్ 111, విరాట్ కోహ్లీ 34, పంత్ 4, పాండ్య 7 పరుగులు చేయగా రజిత, మలింగా, ఉదాన తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో భారత్ గెలుపులో 103 పరుగులతో కీలకంగా నిలిచిన రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది. రోహిత్ శర్మ మొత్తం 94 బంతులతో 14 ఫోర్లు 2 సిక్సులుతో 103 పరుగులు చేశాడు.
