బంగ్లాదేశ్ తో కాన్పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. అసాధ్యమనుకున్న మ్యాచ్ లో అసాధారణంగా పోరాడి మ్యాచ్ గెలిచారు. తొలి రెండు మూడు రోజులు 35 ఓవర్ల ఆట మాత్రమే జరగడంతో మ్యాచ్ డ్రా వైపు సాగింది. ఈ దశలో రోహిత్ సేన టీ20 తరహాలో వేగంగా ఆడుతూ బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ లో పలు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేయడంతో పాటు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డ్స్ సెట్ చేసింది.
ALSO READ | ECB: విదేశీ లీగ్‌లు ఆడేందుకు నో ఛాన్స్.. ఇంగ్లాండ్ ప్లేయర్లకు బోర్డు కఠిన నిర్ణయం
ముఖ్యంగా బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్లో సాగింది. టీ20 క్రికెట్ ఆడుతూ బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించారు. ఓ విప్పు వికెట్లు పడుతున్నా తగ్గేదే లేదంటూ చెలరేగి ఆడారు. ఈ క్రమంలో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి టీమిండియా ఒక్క మెయిడిన్ ఓవర్ ఆడకుండా టెస్ట్ క్రికెట్ లో సరి కొత్త చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్ లో 34.4 ఓవర్లు.. రెండో ఇన్నింగ్స్ లో 17.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. మొత్తం 52 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఒక్క మెయిడిన్ ఓవర్ ఆడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఒక్క రెండు ఇన్నింగ్స్ లు కలిపి ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా ఆడకపోవడం ఇదే తొలిసారి.
ALSO READ | Irani Cup 2024: డబుల్ సెంచరీతో దంచి కొట్టిన సర్ఫరాజ్.. ఇరానీ ట్రోఫీలో ముంబై భారీ స్కోర్
టెస్ట్ క్రికెట్ లో వేగంగా 50, 100, 150, 200,250 పరుగుల మార్క్ ను చేరుకొని చరిత్ర సృష్టించింది. జైశ్వాల్, రోహిత్ విధ్వంసంతో తొలి 3 ఓవర్లకే భారత్ 50 పరుగులు చేసింది. ఆ తర్వాత జైస్వాల్ విధ్వంసంతో 10.1 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. గిల్, కోహ్లీ, రాహుల్ చెలరేగడంతో వేగంగా 18.2 ఓవర్లలో 150 పరుగులు, 24.2 ఓవర్లలో 200 పరుగులు, 30.1 ఓవర్లలో 250 పరుగులు చేసి ఒకే మ్యాచ్ లో 5 ప్రపంచ రికార్డులు నెలకొల్పి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నింగ్స్ ఆసాంతం భారత్ వేగం తగ్గకపోవడం విశేషం.
0 maiden overs in both innings ??#Iran #WorldWar3 pic.twitter.com/ozegbeCx3j
— Kapil Raghav (@KapilRaghav01) October 2, 2024