న్యూఢిల్లీ: యూకేలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మ్యూటెంట్‌గా రూపం మార్చుకుని రెచ్చిపోతోంది. సోమవారం ఒక్క రోజే బ్రిటన్‌లో 24 వేల కొత్త కరోనా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో యూకేలో కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడి నుంచే వచ్చే ఫ్లయిట్‌లను భారత్ నిషేధించింది. ఈ నెల 31 వరకు ఈ బ్యాన్ అమలులో ఉండనుంది. మంగళవారం రాత్రి 11:59 గంటలకు నిషేధం అమలులోకి రానుంది. ఈ మేరకు యూకే నుంచి వచ్చే ఫ్లయిట్‌లపై నిషేధం విధిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (ఎంసీఏ) ట్వీట్ చేసింది.
Considering the prevailing situation in UK. Govt. of India has decided that all flights originating from UK to India to be suspended till 31st December 2020 (23.59 hours).
— MoCA_GoI (@MoCA_GoI) December 21, 2020
యూకే నుంచి మంగళవారం రాత్రి 12 గంటల లోపు భారత్‌కు చేరుకోనున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూకేలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ స్పందించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావొద్దని హర్ష వర్దన్ పేర్కొన్నారు.
As a measure of abundant precaution, passengers arriving from UK in all transit flights (flights that have taken off or flights which are reaching India before 22nd Dec at 23.59 hrs) should be subject to mandatory RT-PCR test on arrival at the airports concerned.
— MoCA_GoI (@MoCA_GoI) December 21, 2020
