- ఒక మిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీ: కేంద్రం
న్యూఢిల్లీ/ఒట్టావా: డోరియన్ హరికేన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ద్వీపదేశం బహామాస్ను ఆదుకునేందుకు ఇండియా ముందుకొచ్చింది. తక్షణ రిలీఫ్ కింద ఆ దేశానికి ఒక మిలియన్ డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. బహామాస్లో డోరియన్ సృష్టించిన విలయంలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షమందికిపైగా ఇండ్లు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బహామాస్ ప్రజలకు ఇండియా అండగా ఉంటుందని రవీశ్ చెప్పారు. అమెరికాలోని సౌత్, నార్త్ కరోలీనా రాష్ట్రాలనూ అతలాకుతలం చేసిన డోరియన్ హరికేన్.. శనివారం రాత్రి కెనడాలోని హలిఫాక్స్ వద్ద తీరాన్ని దాటింది. హరికేన్ తీరాన్ని దాటిన సమయంలో 155 కిలో మీటర్ల వేగంతో పెనుగాలలు వీచాయని, సముద్రపు అలలు 20 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయని కెనడియన్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
