సొంతగడ్డపై టీమిండియా మ్యాచ్ అంటే భారీ స్కోర్ ఖాయం. ఒకవేళ పొరపాటున టాపార్డర్ ఔటైనా మిడిల్ ఆర్డర్ జట్టును నిలబెడతారు. కొన్నిదశాబ్దాలుగా భారత క్రికెట్ లో ఇది జరుగుతుంది. అయితే ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటింగ్ లో దారుణంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌటయ్యారు. భారత్ సొంతగడ్డపై ఇంత చెత్తగా ఆడడం ఇదే తొలిసారి. సొంతగడ్డపై అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఆనందం భారత్ కు కొంతసేపైనా లభించలేదు. వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్ కు చేరారు. కివీస్ పేసర్లు విజృంభించడంతో ఒక్కరు కూడా క్రీజ్ లో కుదురుకోలేకపోయారు. సౌథీ అద్భుతమైన బంతితో రోహిత్ (2) ను బౌల్డ్ చేసి కివీస్ కు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత విలియం ఒరోర్కే, హెన్రీ చెలరేగిపోయారు. ఈ క్రమంలో కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, జడేజా డకౌటయ్యారు.
Also Read : ద్వైపాక్షిక సిరీస్కు గుడ్ బై.. భారత్, పాక్ సిరీస్ లేనట్టేనా!
20 పరుగులు చేసి రిషబ్ పంత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైశ్వాల్ 13 పరుగులు మాత్రమే చేశాడు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఒరోర్కే 5 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ALL OUT FOR 46 ?
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2024
It's the lowest total India have been dismissed for at home https://t.co/tzXZHnJPJI | #INDvNZ pic.twitter.com/x7z1SPzW5N