Australia tour: గైక్వాడ్‌కు పగ్గాలు.. భారత్ ఏ జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఆస్ట్రేలియా పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన ఇండియా ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బెంగాల్ రంజీ ట్రోఫీ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్ గా ఛాన్స్ దక్కింది. నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్, నవదీప్ సైనీలు ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. 

ఇషాన్ కిషన్, అభిషేక్ పోరెల్ వికెట్ కీపర్లుగా ఉంటారు. చాలా రోజుల తర్వాత కిషాన్ ఫస్ట్ క్లాస్ స్క్వాడ్ లో చోటు దక్కించుకోవడం విశేషం. భారత ఏ జట్టు ఆస్ట్రేలియా ఎ జట్టుతో  రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడతారు. ఈ రెండు మ్యాచ్ లకు మాకే, మెల్‌బోర్న్‌ ఆతిధ్యమిస్తాయి. పెర్త్‌లో టీమ్ ఇండియా (సీనియర్ మెన్)తో జరిగే మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌లో ఇండియా ఎ కూడా పాల్గొంటుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) కార్యదర్శి జే షా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఇండియా ఏ పర్యటన అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 వరకు మాకేలో నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్ట్ ప్రారంభమవుతుంది. నవంబర్ 7 నుండి 10 వరకు మెల్‌బోర్న్‌లో రెండో మ్యాచ్ తో ఇండియా ఏ ఈ పర్యటనను ముగిస్తుంది. నవంబర్ 15 నుండి 17 వరకు పెర్త్‌లో సీనియర్ టీంతో గైక్వాడ్ సేన తలపడనుంది. 

ఆస్ట్రేలియా పర్యటనకు భారత ఎ జట్టు:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యష్ దయాల్, నవదీప్ సైనీ, మానవ్ సుతార్, తనుష్ కోటియన్.