తిలక్ వర్మకు కెప్టెన్సీ

న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ  మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో పోటీపడే  ఇండియా–ఎ జట్టుకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 18 నుంచి 27 వరకు మస్కట్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ టోర్నీ కోసం సెలెక్షన్ కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు, 16 టీ20లు ఆడిన అనుభవం ఉన్న 21 ఏండ్ల  తిలక్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్సీ అప్పగించింది. మరో యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మకు వైస్ కెప్టెన్సీ ఇచ్చింది. ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, అనూజ్ రావత్‌‌‌‌‌‌‌‌, ఆయుష్ బదోనీ, రమణ్​దీప్‌‌‌‌‌‌‌‌, నేహల్ వాధెర వంటి కుర్రాళ్లకు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఈ టోర్నీలో  గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో ఉన్న ఇండియా.. ఈ నెల 19న పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో తన పోరు ఆరంభించనుంది. కాగా, ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో జరగడం ఇదే తొలిసారి.  

ఇండియా -ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), అభిషేక్ శర్మ (వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌), ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రాన్ సింగ్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), నిషాంత్ సింధు, రమణ్‌‌దీప్, నెహాల్ వధేరా, ఆయుష్ బదోనీ, అనూజ్ రావత్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సాయి కిషోర్, హృతిక్ షోకీన్, రాహుల్ చహర్, వైభవ్ అరోరా, అన్షుల్ కాంబోజ్, ఆకీబ్ ఖాన్, రసిక్ సలామ్.