తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోలుకున్న ఇండియా-ఎ

మకే (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా–ఎతో అనధికార తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ తడబడి తేరుకుంది. సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (96 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), దేవదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (80 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చెలరేగడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట చివరకు  64 ఓవర్లలో 208/2 స్కోరు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 47.4 ఓవర్లలో 107 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది.

తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఆస్ట్రేలియా–ఎ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 62.4 ఓవర్లలో 195 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.  ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో సత్తా చాటుతున్న ఇండియా–ఎ ప్రస్తుతం 120 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.