ఓటమి అంచుల్లో ఇండియా-ఎ

మకే (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా–ఎతో  తొలి అనధికార టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండియా–ఎ జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. ఇండియా ఇచ్చిన 225 రన్స్  టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో రోజు, శనివారం చివరకు ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  139/3 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాథన్ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీనీ (47 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), బ్యూ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ (19 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయానికి చివరి రోజు 86 రన్స్ మాత్రమే అవసరం అవగా..

ఇండియాకు ఏడు వికెట్లు కావాలి. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు  208/2తో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగించిన ఇండియా–ఎ 312 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.  ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (103) సెంచరీ పూర్తి చేసుకోగా..  దేవదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (88) మరో 8 రన్స్ మాత్రమే చేశాడు.  ఇషాన్ కిషన్ (32) ఫర్వాలేదనిపించగా.. నితీశ్ రెడ్డి (17), మానవ్ సుతార్ (6) నిరాశపరిచారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో ఫెర్గూస్ ఒనీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు, టాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముర్ఫీ మూడు వికెట్లు తీశారు.