IND A vs AUS A: జురెల్‌‌‌‌ మెరిసినా.. ఇండియా–ఎకు తప్పని ఓటమి

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: యంగ్‌‌‌‌ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (68) మరోసారి బ్యాటింగ్‌‌‌‌లో మెరిసినా.. ఇండియా–ఎకు ఓటమి తప్పలేదు. చిన్న టార్గెట్‌‌‌‌ను కాపాడటంలో బౌలర్లు ఫెయిల్‌‌‌‌ కావడంతో.. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో అనధికార టెస్ట్‌‌‌‌లో ఆస్ట్రేలియా–ఎ 6 వికెట్ల తేడాతో ఇండియాపై నెగ్గింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 2–0తో సొంతం చేసుకుంది. 

ఇండియా నిర్దేశించిన 168 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం బరిలోకి దిగిన ఆసీస్‌‌‌‌ 47.5 ఓవర్లలో 169/4 స్కోరు చేసి నెగ్గింది. సామ్‌‌‌‌ కోన్‌‌‌‌స్టాస్‌‌‌‌ (73 నాటౌట్‌‌‌‌), బ్యూ వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ (46 నాటౌట్‌‌‌‌), నేథన్‌‌‌‌ మెక్‌‌‌‌స్వీని (25) నిలకడగా ఆడారు. ప్రసిధ్‌‌‌‌ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు 73/5 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా–ఎ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 77.5 ఓవర్లలో 229 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. జురెల్‌‌‌‌, నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (38) ఆరో వికెట్‌‌‌‌కు 94 రన్స్‌‌‌‌ జత చేశారు. చివర్లో తనుష్‌‌‌‌ కొటియాన్‌‌‌‌ (44), ప్రసిధ్‌‌‌‌ కృష్ణ (29) మెరుగ్గా ఆడారు. రొచిసియోలి 4, వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ 3, నేథన్‌‌‌‌ మెక్‌‌‌‌అండ్రూ 2 వికెట్లు పడగొట్టారు.