ఫస్ట్ డే ఆట ముగిసే సరికి టీమిండియా స్కోర్ ఎంతంటే…

ఫస్ట్ డే ఆట ముగిసే సరికి టీమిండియా స్కోర్ ఎంతంటే…
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా  ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసిస్ ను 195 పరుగులకు ఆలౌట్ చేయగానే బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంబంలోనే వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం శుబ్ మన్ గిల్ 28, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్  ఇంకా 159 పరుగల వెనుకంజలో ఉంది. అంతకు ముందు భారత బౌలర్లు చెలరేగారు. ఆసిస్ బ్యాట్స్ మెన్ ను తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు పంపడంతో  మొదటి ఇన్నింగ్స్ లో ఆసిస్ 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30 మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇక భారత బౌలర్లు బుమ్రా 4, రవిచంద్ర అశ్విన్ 3,సిరాజ్ 2,ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ పడ్డాయి. ఇక తొలి టెస్టు ఆడుతున్న హైదరాబాద్ యువ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీశాడు.