గేదెపై ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధి..ఎందుకంటే..?

గేదెపై ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధి..ఎందుకంటే..?

మరి కొద్దిరోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు సిచ్యువేషన్ కు అనుగుణంగా నామినేషన్ దాఖలు చేశారు.

బీహార్ దర్బంగా జిల్లా బహదరాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి రైతు నాచారి మండల్ గేదెపై ఊరేగింపుతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాచారి మండల్ మాట్లాడుతూ తాను పేద కుటుంబం నుంచి వచ్చినట్లు, కనీసం కూర్చోడానికి కూర్చీ కూడా లేదని తెలిపారు.  నేను రైతు కొడుకును  నా దగ్గర ద్విచక్రవాహనం లేదని.. గేదెలు, ఆవులు మరియు ఎద్దులు రైతుకు సంపదలాంటివని ప్రశంసల వర్షం కురిపించారు.

రైతుల ప్రయోజనాల కోసం తాను కృషి చేస్తానని, ఎన్నికైనట్లయితే బలహీన వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలను అందించడమే లక్ష్యమని మండల్ అన్నారు.

ప్రస్తుతం, మాజీ ఎమ్మెల్యేలు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఓ రైతుగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు.