సెకండ్‌ వన్డేలోనూ టీమిండియ విక్టరీ

సెకండ్‌ వన్డేలోనూ టీమిండియ విక్టరీ
  •     సిరీస్‌ మనదే
  •     సెకండ్‌ వన్డేలోనూ ఇండియాదే విక్టరీ
  •     రాణించిన సూర్య, రాహుల్‌‌, ప్రసిధ్‌‌
  •     44 రన్స్​ తేడాతో విండీస్​ ఓటమి

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌: టీమిండియా ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షో ముందు.. వెస్టిండీస్‌‌‌‌ మళ్లీ తేలిపోయింది. దీంతో బుధవారం జరిగిన సెకండ్‌‌‌‌ వన్డేలో ఇండియా 44 రన్స్‌‌‌‌ తేడాతో విండీస్‌‌‌‌పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌‌‌‌ గెలిచి కరీబియన్లు ఫీల్డింగ్‌‌‌‌ ఎంచుకోగా, ఇండియా 50 ఓవర్లలో 237/9 స్కోరు చేసింది. సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (83 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 64), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (48 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన వెస్టిండీస్‌‌‌‌ 46 ఓవర్లలో 193 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. బ్రూక్స్‌‌‌‌ (44) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. 4 వికెట్లు తీసిన ప్రసిధ్‌‌‌‌ కృష్ణకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్​లో చివరి, మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది.

విరాట్‌‌‌‌ మళ్లీ ఫెయిల్‌‌‌‌.. సూర్య, రాహుల్‌‌‌‌ షో
స్లో ట్రాక్‌‌‌‌పై ఇండియా టాపార్డర్‌‌‌‌ను.. విండీస్‌‌‌‌ బౌలర్లు దెబ్బకొట్టారు. థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ (5).. రోచ్‌‌‌‌ (1/42) వేసిన వైడ్‌‌‌‌ డెలివరీని వెంటాడి ఔటయ్యాడు. ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా వచ్చిన రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (18)తో కలిసి స్వదేశంలో వందో వన్డే ఆడుతున్న విరాట్‌‌‌‌ కోహ్లీ (18) ఇన్నింగ్స్‌‌‌‌ను బాగు చేసేందుకు ట్రై చేశాడు. ఐదో ఓవర్‌‌‌‌లో రెండు సూపర్‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌తో బౌండ్రీలు రాబట్టిన కోహ్లీ కుదురుకున్నట్లే కనిపించాడు. పంత్‌‌‌‌ కూడా రెండు ఫుల్‌‌‌‌ షాట్స్‌‌‌‌ ఫోర్లతో టచ్‌‌‌‌లోకి వచ్చాడు. కానీ పేసర్‌‌‌‌ ఓడెన్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (2/29).. 12వ ఓవర్‌‌‌‌లో ఈ ఇద్దర్ని ఔట్‌‌‌‌ చేయడంతో ఇండియా స్కోరు 43/3గా మారింది.  ఈ దశలో వచ్చిన సూర్యకుమార్‌‌‌‌, రాహుల్‌‌‌‌.. విండీస్‌‌‌‌ బౌలర్లను ఎటాక్​ చేశారు.  మంచి కవర్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో ఖాతా ఆరంభించిన సూర్య.. స్టార్టింగ్‌‌‌‌లో దూకుడుగా ఆడాడు. అకీల్‌‌‌‌ హొస్సేన్‌‌‌‌ (1/39) బౌలింగ్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ టవరింగ్‌‌‌‌ షాట్స్‌‌‌‌ కొట్టాడు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడటంతో 25 ఓవర్లలో ఇండియా 91/3 స్కోరు చేసింది. ఇక ఓకే అనుకుంటున్న టైమ్‌‌‌‌లో 30వ ఓవర్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ అనూహ్యంగా రనౌట్‌‌‌‌కావడంతో ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 91 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో సుందర్‌‌‌‌ (24)తో కలిసి ఐదో వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ జత చేసిన సూర్య.. 39వ ఓవర్‌‌‌‌లో ఓ సింపుల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు వెనుదిరిగాడు. లాస్ట్‌‌‌‌లో దీపక్‌‌‌‌ హుడా (29) బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో ఇండియా స్కోరు 200లు దాటింది. లాస్ట్‌‌‌‌ 10 ఓవర్స్‌‌‌‌లో ఇండియా 54 రన్స్‌‌‌‌ మాత్రమే చేసింది.  

పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టిన్రు..
టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ బ్యాటర్లు.. ఇండియా బౌలర్ల ముందు నిలువలేకపోయారు. పేస్‌‌‌‌-–స్పిన్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ బాగా పని చేయడంతో ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడలేకపోయారు. ఓపెనర్లలో హోప్‌‌‌‌ (27), బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌ (18) ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 32 రన్స్‌‌‌‌ జోడించినా.. 10 బాల్స్‌‌‌‌ తేడాలో కింగ్‌‌‌‌, డారెన్‌‌‌‌ బ్రావో (1).. ప్రసిధ్ బౌలింగ్​లో ఔటయ్యారు. 38/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన  బ్రూక్స్‌‌‌‌ ఆచితూచి ఆడాడు. కానీ అవతలి వైపు హోప్‌‌‌‌, పూరన్ (9), హోల్డర్‌‌‌‌ (2) వరుసగా ఔటవడంతో విండీస్‌‌‌‌ 76 రన్స్‌‌‌‌కే సగం టీమ్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు చేరింది. అయితే అకీల్‌‌‌‌ (34)తో కలిసి ఆరో వికెట్‌‌‌‌కు 41 రన్స్‌‌‌‌ జోడించిన బ్రూక్స్‌‌‌‌.. 31 ఓవర్‌‌‌‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఓడెన్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (24) కాసేపు హిట్టింగ్​ చేసినా.. లాస్ట్‌‌‌‌లో మరెవరూ రాణించకపోవడంతో విండీస్‌‌‌‌ మరోసారి 50 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది.  

 స్కోర్స్‌‌‌‌
ఇండియా: 50 ఓవర్లలో 237/9 (సూర్యకుమార్‌‌‌‌ 64, రాహుల్‌‌‌‌ 49,   జోసెఫ్‌‌‌‌ 2/36, ఓడెన్‌‌‌‌  2/29),
వెస్టిండీస్‌‌‌‌: 46 ఓవర్లలో 193 ఆలౌట్‌‌‌‌ (బ్రూక్స్‌‌‌‌ 44, హొస్సేన్‌‌‌‌ 34, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ 4/12).

మరిన్ని వార్తలు