- కరోనాతో షమీ, గాయంతో హుడా దూరం.. పాండ్యాకు రెస్ట్
న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకోని పేసర్ మహ్మద్ షమీ సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. బుధవారం మొదలయ్యే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చారు. వెన్ను నొప్పి కారణంగా ఆల్‌రౌండర్ దీపక్ హుడా కూడా ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. పాండ్యా, హుడా స్థానాల్లో బెంగాల్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చారు. ఇక, టీ20ల తర్వాత వచ్చేనెలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు యువ బ్యాటర్ రజత్ పటీదార్‌ను తొలిసారి నేషనల్ టీమ్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తొలి టీ20 కోసం ఇండియా, సౌతాఫ్రికా జట్లు సోమవారం తిరువనంతపురం చేరుకున్నాయి. ప్లేయర్లకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేస్తాయి.
