డర్బన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో గొడవ చోటుచేసుకుంది. ఓడిపోతున్నామన్న బాధలో సఫారీ పేసర్ మార్కో జాన్సెన్.. భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్‍తో వాగ్వదానికి దిగాడు. పిచ్‌పై కాలు పెట్టాడన్న నెపంతో అతని పట్ల దురుసుగా ప్రవర్తించాడు. వెంటనే భారత కెప్టెన్ సూర్య కలుగజేసుకొని సఫారీ పేసర్‌కు బుద్ధి చెప్పాడు.
అసలేం జరిగిందంటే..?
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఛేదనలో ప్రోటీస్ జట్టు 14 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి చివరి 6 ఓవర్లలో 102 పరుగులు చేయాలి. ఆ సమయంలోనే గొడవ చోటుచేసుకుంది. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్ రెండో బంతిని కోయెట్జీ లాంగ్-ఆఫ్ వైపుగా ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రమణ్‌దీప్ సింగ్ బంతిని కీపర్‌కు విసిరాడు. ఆ త్రో కాస్త నేరుగా కీపర్ వైపుగా వెళ్లకుండా.. పిచ్ మధ్య వైపు వెళ్ళింది. వెంటనే శాంసన్ పిచ్ వైపు పరుగులు తీసి బంతిని అందుకున్నాడు.
అంతే, జెన్‌సెన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎందుకు పిచ్ తొక్కుతున్నావంటూ శాంసన్‌తో వాగ్వదానికి దిగాడు. బంతి అటొచ్చిన విషయాన్ని చెప్తున్నప్పటికీ నోరు పారేసుకున్నాడు. వెంటనే సూర్యకుమార్ యాదవ్ కలుగజేసుకొని సఫారీ పేసర్‌కు తగిన బుద్ధి చెప్పాడు. బంతి ఎటొచ్చిందో చూడలేదా..? ఏంది.. ఏంది.. అంటూ జెన్‌సెన్‌ను ప్రశ్నించాడు. వెంటనే స్క్వేర్ లెగ్ అంపైర్ జోక్యం చేసుకొని ఇరు జట్ల ప్లేయర్లకు సర్ది చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024
శాంసన్ సెంచరీ.. టీమిండియా భారీ విజయం
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూర్య సేన సఫారీల ఎదుట 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఛేదనలో ఆతిథ్య జట్టు 141 పరుగులకే కుప్పకూలింది. యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్(107; 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. ఇక బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Heated moment between Surya Kumar Yadav and Marco Yansen ???#SuryakumarYadav #INDvsSA #sanju_samson #sANJUSAMSAN #SAvIND #PAKvsAUS #PAKvAUS pic.twitter.com/34pkanFMjV
— Sports Shastra (@SportShastra) November 8, 2024
ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(నవంబర్ 10) రెండో టీ20 జరగనుంది.