రెండో టెస్టులో గెలుపు ముంగిట కివీస్

  • 7 వికెట్లతో దెబ్బకొట్టిన శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 198/5
  • రాణించిన లాథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్లండెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 301 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంతో గెలుపు ముంగిట కివీస్‌‌

పుణె: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దాసోహమైంది. కివీస్  స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7/35) స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాయాజాలానికి అడ్డుకట్ట వేయలేకపోయిన ఇండియా స్టార్లు పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు. దీంతో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 16/1తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 53 ఓవర్లలో 156 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 103 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా (38), యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (30), శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (30) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే సమయానికి 53 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లండెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (30 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (86) ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉతికేశాడు. వాషింగ్టన్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు తీసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 301 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో నిలిచిన కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1955–56 తర్వాత ఇండియా గడ్డపై తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం వైపు దూసుకెళ్తోంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా డ్రాతో గట్టెక్కాలన్నా అద్భుతం జరగాల్సిందే. లేదంటే స్వదేశంలో వరుసగా 18 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయాల రికార్డుకు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతుంది.  

ఒక్క సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే..

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా లేదని తెలిసినా.. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడంలో ఇండియా బ్యాటర్లు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. దీంతో తొలి సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 91 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆరు కీలక వికెట్లు పడటంతో ఆట మొత్తం తారుమారైంది. 22వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్ల పతనం మొదలుపెట్టాడు. 24వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అతిపెద్ద షాకిచ్చాడు. అనూహ్యంగా స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతూ వికెట్లపైకి దూసుకొచ్చిన ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడటంలో కోహ్లీ ఫెయిలయ్యాడు. దీంతో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై పడింది. ఆ వెంటనే పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/26) వరుస విరామాల్లో జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (18)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపి డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. ఫలితంగా ఇండియా 83/5తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో జడేజా కాసేపు బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్డేసినా, శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన వరుస ఓవర్లలో సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (11), అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4)ను దెబ్బకొట్టాడు. జడ్డూతో కలిసిన సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (18 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. తన వరుస ఓవర్లలో జడేజా, ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6)తో పాటు  బుమ్రా (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. 

లాథమ్‌ జోరు..

సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లాథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1/64) కట్టడి చేసే ప్రయత్నం చేసినా అతను భారీ షాట్లతో కీలక భాగస్వామ్యాలు జోడించాడు. కాన్వే (17)తో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 36, విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (23)తో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 42, డారిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (18)తో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 34, బ్లండెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 60 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేసి ఔటయ్యాడు. మధ్యలో రచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (9) నిరాశపర్చాడు. యంగ్‌ను అశ్విన్ వెనక్కు పంపగా. మిగతా నలుగురిని ఔట్ చేసిన సుందర్‌‌ ఆకట్టుకున్నాడు. 

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 259 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 45.3 ఓవర్లలో 156 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జడేజా 38, జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30, శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7/53), న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 53 ఓవర్లలో 198/5 (లాథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 86, బ్లండెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30*, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4/56).