ఓటమి తప్పేనా! .. కివీస్ ముందు 107 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 462 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ సెంచరీ,  రిషబ్ పంత్ మెరుపులు
  • మిగతా బ్యాటర్లు ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బెంగళూరు:  ఇండియా–న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి టెస్టు ఆసక్తికర మలుపులు తిరుగుతూ ఆఖరి రోజుకు చేరుకుంది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైనా... నాలుగో రోజు, శనివారం  సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్ (195 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 150) భారీ సెంచరీతో పాటు  రిషబ్ పంత్ (105 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 99) దంచికొట్టాడు. వీళ్ల జోరుతో  రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఓ దశలో 408/3తో నిలిచి  విజయంపైనా ఆశలు రేపిన టీమిండియా ఆఖర్లో తడబడింది. 54 రన్స్ తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోయి 99.3 ఓవర్లలో 462 స్కోరు వద్ద ఆలౌటైంది. ప్రత్యర్థికి 107 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్ మాత్రమే ఇచ్చింది. దాంతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియా గడ్డపై తొలి టెస్టు విజయం ముంగిట నిలిచింది. సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి సెంచరీతో కదం తొక్కగా... ఒక్క రన్ తేడాతో సెంచరీ కోల్పోయిన రిషబ్ పంత్ అదరగొట్టడంతో  పుంజుకున్న ఆతిథ్య జట్టును విలియమ్ ఒరూర్కె (3/92), మ్యాట్ హెన్రీ (3/102) చెరో మూడు వికెట్లతో మరోసారి దెబ్బకొట్టారు. అజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన న్యూజిలాండ్ నాలుగో రోజు చివరకు 0.4 ఓవర్లలో  0/0తో నిలిచింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), డెవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్వే (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. చేతిలో పది వికెట్లు ఉండటంతో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపు ఖాయమే అనొచ్చు.  ఆదివారం వర్ష సూచన కూడా ఉండగా..  బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఇండియా ఓటమి తప్పించుకోవడం కష్టమే. 

సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పంత్ ఫటాఫట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 231/3తో  125 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుకంజతో  ఇండియా  రోజు ఆట ప్రారంభించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్ సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే జోరు కొనసాగించగా.. కొత్త బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషబ్ పంత్ ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత భారీ షాట్లతో విజృంభించాడు. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదో టెస్టులోనే గొప్ప పరిణతి చూపెట్టిన  సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతమైన లేట్ కట్ షాట్లతో వరుస బౌండ్రీలు రాబట్టాడు. స్వీప్ షాట్లతో స్పిన్నర్లపై పైచేయి సాధించాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఆరంభంలో ఇబ్బంది పడటంతో పాటు సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమయన్వయ లోపంతో రనౌట్ ప్రమాదం తప్పించుకున్న పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రీజులో కుదురుకున్నాక వెనుదిరిగి చూసుకోలేదు. స్పిన్నర్ అజాజ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు సిక్సర్లతో వేగం పెంచిన రిషబ్ చూడచక్కటి షాట్లతో అలరించాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కవర్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 55 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. 

ఇద్దరూ జోరుమీదున్న సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోగా.. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఆట తిరిగి మొదలయ్యాక పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా రెండు సిక్సర్లతో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖుషీ చేశాడు. ఓసారి క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మరోసారి ఎల్బీ అయినా డీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బతికిపోయిన రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కివీస్ బౌలర్లందరిపై ఎదురుదాడి చేశాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొట్టిన స్లాగ్ స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌కు బాల్‌‌‌‌ స్టేడియం అవతల పడింది. మరోవైపు 150 మార్కు చేరుకున్న తర్వాత సౌథీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్కూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి సర్ఫరాజ్‌‌  ఔటవడంతో నాలుగో వికెట్‌‌కు 177 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్ ముగిసింది.

దెబ్బకొట్టిన ఒరూర్కె, హెన్రీ

పంత్ కొట్టిన భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బంతి స్టేడియం అవతల పడటంతో మరోసారి కొత్త బంతి అందుకున్న తర్వాత కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఒరూర్కె పదునైన బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దెబ్బకొట్టాడు. అతని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా బౌన్స్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలస్యంగా ఆడగా ఎడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొని వికెట్లకు తాకింది. దాంతో ఒక్క రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో పంత్ సెంచరీ మిస్సయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరో అద్భుతమైన బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్ (12)ను కూడా ఒరూర్కె పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. 438/6తో టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత జడేజాను కూడా అతనే ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆపై, హెన్రీ వరుస ఓవర్లలో అశ్విన్ (15)తో పాటు  బుమ్రా (0), సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) పెవిలియన్ చేరడంతో ఇండియా ఆలౌటైంది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కివీస్ 4 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిన తర్వాత వెలుతురు తగ్గిపోయిందని అంపైర్లు ఆటను ముగించారు. 

 సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 46 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌;  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 402 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌; ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 99.3 ఓవర్లలో 462 ఆలౌట్  ( సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 150, పంత్ 99, ఒరూర్కె 3/92, హెన్రీ 3/102).  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 107): 0.4 ఓవర్లలో 0/0 (  లాథమ్ 0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డెవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్వే 0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌).