IND Vs NZ: బెంగుళూరులో ఎడతెరిపిలేని వర్షం.. తొలి రోజు ఆట రద్దు

బెంగుళూరులో వర్షం కురుస్తుండటంతో భార‌త్, న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన తొలి టెస్టు మొదటి రోజు ఆట రద్దయ్యింది. మ్యాచ్ ప్రారంభించేందుకు సిబ్బంది, అంపైర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ, వరుణుడు మాత్రం కరుణించలేదు. అరగంటకోసారి వచ్చి అందరినీ పలకరిస్తున్నాడు. ఇప్పటికే మైదానం తడిగా మారడం.. వర్షం పూర్తిగా తగ్గే సూచనలు లేకపోవడంతో టీ బ్రేక్ తరువాత పిచ్‌ ప‌రిశీలించిన అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉదయం నుంచే ఒకటే వర్షం

బెంగుళూరులో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. చిన్నస్వామి స్టేడియం డ్రైనేజీ వ్యవస్థ బాగుండటంతో వర్షం తగ్గుముఖం పడితే మ్యాచ్ ప్రారంభించవచ్చని అంపైర్లు భావించారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. మీరెట్లా ఆడతారో చూస్తానంటూ వరుణుడు అక్కడ తిష్టవేసి కూర్చున్నాడు.  చేసేదేం లేక అంపైర్లే ఆటను రద్దు చేసి హోటల్‌కు బయలుదేరారు.

ALSO READ | Sania Mirza: నిజమేంటి..?: సోషల్ మీడియాలో సానియా మీర్జా రెండో పెళ్లి గోల