IND vs BAN 2024: మరో గంటలో ఉప్పల్‌లో మ్యాచ్.. స్టేడియం పరిసరాల్లో వర్షం

ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మరొకొన్ని గంటల్లో భారత్, బంగ్లాదేశ్ చివరి టీ20 ఆడనున్నాయి. ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. మ్యాచ్ కు భారీ వర్షం అంతరాయం అయితే కనిపించడం లేదు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ పై అనుమానాలు నెలకొన్నాయి.

వర్షం కారణంగా శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) కూడా బాంగ్లాదేశ్ టీం ప్రాక్టీస్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో బంగ్లా ప్లేయర్లు నెట్స్ కే పరిమితమయ్యారు. వర్షం కురిసే సూచనలున్న క్రమంలో పిచ్ ని, గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు స్టేడియం సిబ్బంది. మరి, శనివారం ( అక్టోబర్ 12, 2024 ) అక్కడక్కడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో భారత్ - బంగ్లా జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

ALSO READ : IPL 2025: నేను ఇప్పటివరకు అలా చేయలేదు: ఫారెన్ ప్లేయర్ రూల్‌పై కమ్మిన్స్

ఇప్పటికే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే 2-0 తేడాతో సిరీస్ గెలుస్తుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని సూర్య సేన భావిస్తుంది. మరో వైపు కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ చూస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.