IND vs BAN 2nd Test: భారత బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోరుకే బంగ్లా ఆలౌట్

కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 74.2 ఓవర్లలో 233 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. 107/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా మరో 126 పరుగులు మాత్రమే జోడించగలిగింది. మమినుల్ హక్(107*) ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు. సహచర బ్యాటర్లు వీడుతున్నా.. మరో ఎండ్‌లో తాను మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు. 194 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులతో నౌటౌట్‌గా నిలిచాడు.

300 వికెట్ల క్లబ్‌లో జడేజా

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3.. సిరాజ్, అశ్విన్, ఆకాష్ దీప్ త్రయం రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‍లో ఏకైక వికెట్ తీసుకున్న జడేజా.. టెస్టుల్లో 300 వికెట్ల తీసిన బౌలర్ల సరసన చేరాడు. భారత తొలి ఇన్నింగ్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

Also Read:-పక్కపక్కనే ఉన్నా పలకరింపుల్లేవ్