AUS vs IND: బాక్సింగ్ డే టెస్ట్ కు రెడీ.. ఓపెనర్ గా రోహిత్.!

బోర్డర్-గవాస్కర్ సిరీస్ నాల్గో టెస్టుకు రంగం సిద్ధమైంది. మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26న  జరిగే బాక్సింగ్ డే టెస్టులో గెలుపే లక్ష్యంగా భారత్, ఆసిస్ బరిలోకి దిగనున్నాయి. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి.. సమంగా నిలిచాయి. బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి సిరీస్ లో ముందుకెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి. దీంతో నాల్గో టెస్టుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. 

Also Read : నా మోకాలు బాగానే ఉంది..బ్యాటింగ్ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టెన్షన్ వద్దు

బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా ఆడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ మూడో వికెట్ గా బరిలోకే దిగే అవకాశం ఉంది. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టులలో రోహిత్ మిడిలార్డర్ స్థానంలో ఆడిన రోహిత్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అందుకోసం రోహిత్ ఓపెనర్ గా వస్తేనే టీమ్ కు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. 

టీమ్ లో మార్పులు

రోహిత్ ఓపెనర్ గా ఆడితే రాహుల్ థర్డ్ ప్లేస్ లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో శుబ్ మన్ గిల్ ను పక్కన పెట్టనున్నారు. యావరేజ్ 20 రన్స్ తో మొత్తం సీరీస్ లో కేవలం 60 రన్స్ మాత్రమే చేసిన గిల్ ఇంకా కుదురుకోలేకపోతున్నాడు. ఇక రవీంద్ర జడేజా 6వ స్థానంలో ఆడనున్నాడు. ఇక ఆసీస్ టెస్టు సీరీస్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ తో విశ్లేషకులను ఆకట్టుకున్న హైదరాబాదీ నితీష్ కుమార్ రెడ్డి టీమ్ లెవెన్ లో స్థానం పటిష్ఠం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు కూడా నితీష్ ఆడనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 179 రన్స్ చేసి, కీలక వికెట్లు తీసిన నితీష్ కీలక ఆల్ రౌండర్ గా జట్టుకు అవసరం అని నిరూపించుకున్నాడు. 

మెల్ బోర్న్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. సుందర్ ఆడితే.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మూడు మార్పులతో  బరిలోకి దిగనుంది.