వీడియో: పంత్‌ ఒళ్లంతా కుళ్లబొడిచారు కదయ్యా.. కమిలిపోయిన గాయాలు

బాక్సింగ్ డే టెస్ట్ ఓటమి పౌరుషమో.. డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ తిట్టారన్న కోపమో తెలియదు కానీ, సిడ్నీ టెస్టులో రిషభ్‌ పంత్ పోరాట పటిమను చూపాడు. ఆసీస్ బౌలర్లు ఎంత రెచ్చగొట్టినా మిన్నకుండి పోయాడు. శరీరానికి బంతులేస్తూ ఒళ్ళంతా కుళ్లబొడుస్తున్న మౌనం వహించాడు. ఆ పోరాటమే టీమిండియాకు గౌరవప్రదరమైన స్కోర్ అందించింది. ఆసీస్ పదునైన పేస్‌ను ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 40 పరుగులు చేశాడంటే గొప్పే అనుకోవాలి. 

Also Read :- మళ్లీ అదే తడబాటు.. టీమిండియా 185 పరుగులకు ఆలౌట్

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లకు ఆసీస్ పేసర్లు చుక్కలు చూపించారు. ఖచ్చితమైన లైన్ యాడ్ లెంగ్త్, పదునైన పేస్‌తో ముప్పతిప్పలు పెట్టారు. ఔటవ్వకుండా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన వారికి శరీరానికి బంతులేస్తూ భయపెట్టారు. పంత్ ఒళ్లంతా గాయాలు చేశారు. ఆసీస్ పేసర్ల దెబ్బకు భారత ఫిజియో రెండుసార్లు గ్రౌండ్‌లోకి రావాల్సి వ‌చ్చింది. స్టార్క్ వేసిన బౌన్సర్‌‌కు పంత్ భుజం వ‌ద్ద త‌గిలిన గాయం నల్లగా కమిలిపోయింది. ఇక బోలాండ్ వేసిన బంతి థై ప్యాడ్స్ పైభాగాన త‌గిలడంతో అక్కడ వాపొచ్చింది.

సిరాజ్ దవడ పగలగొట్టారు..

చివరలో వికెట్ కాపాడే ప్రయత్నం చేసిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లను భయపెట్టారు. వాషింగ్టన్ సుందర్(14) బాక్స్‌కు గురిపెట్టి బంతులేశారు. ఇక సిరాజ్‌ను అయితే ఏకంగా దవడ పగలగొట్టారు. బంతి దవడకు తగలగానే సిరాజ్ విలవిలలాడిపోయాడు. ఇన్ని పోరాటాలు చేసిన మనోళ్లు ఓ 300 పరుగులు చేశారా..! లేదు. 180 పరుగులకే కుప్పకూలారు.