మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా గట్టెక్కినట్లే కనిపిస్తోంది. కష్టాల్లో ఉన్న జట్టును తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (85*) మరోసారి ఆదుకున్నాడు. కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసి.. ఫాలోఆన్ ముప్పును దాటించాడు. వాషింగ్టన్ సుందర్ (22*)తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.
కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ
రోహిత్, విరాట్, రాహుల్, పంత్ వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు విఫలమైన చోట నితీష్ రెడ్డి ఎదురొడ్డి పోరాడుతున్నాడు. ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ ఆసీస్ పేసర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో 81 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ(50 పరుగులు) పూర్తి చేసుకొని.. తగ్గేదేలే అంటూ పుష్ప రాజ్ స్టయిల్లో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్(40*) ది అదే ఆట. సింగిల్స్‌కు ప్రాధాన్యమిస్తూ ఒక్కొక్క పరుగు జోడిస్తున్నాడు.
NITISH KUMAR REDDY WITH PUSHPA CELEBRATION. ? pic.twitter.com/9NHjpPdBpj
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024
ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 97 ఓవర్లు ముగిసేసరికి 326/7. నితీశ్ రెడ్డి(85*), సుందర్ (40*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన ఇంకో 148 పరుగులు వెనకపడి ఉంది.
వర్షం అంతరాయం
ఇదిలావుంటే, మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. సిబ్బంది ప్రధాన పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఎర్లీ టీ బ్రేక్ ఇచ్చారు. ఆటకు లైటింగ్ కూడా సహకరించడం లేదు. మబ్బులు పట్టిన వాతావరణం ఉంది.