బెంచ్‌‌‌‌‌‌‌‌ బలమెంత .. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో పలు ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌..పేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే తిప్పలు

స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌ వెలుగు : ప్రతిష్టాత్మక బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో పరాజయం టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. పదేండ్లుగా ఇండియా వద్ద ఉన్న ట్రోఫీ చేజారింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మూడోసారి ఫైనల్ చేరాలనుకున్న ఆశలూ గల్లంతయ్యాయి. వీటికి తోడు కెప్టెన్ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం ప్రశ్నార్థకం అయింది. మొత్తంగా ఐదు టెస్టుల ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో సీనియర్ ఆటగాళ్ల ఆట తీరుపై విమర్శలతో పాటు మన బెంచ్‌‌‌‌‌‌‌‌ బలం ఎంత? అన్న ప్రశ్ననూ లేవనెత్తింది.  ఈ ట్రోఫీలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును దెబ్బతీసినా అదే సమయంలో సరైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌ వనరులు లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. 

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ విభాగంతో పోలిస్తే.. బుమ్రా మినహా పసలేని పేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ విభాగంపైనే సమీప భవిష్యత్తులో ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ మాదిరి స్ట్రయిక్ బౌలర్లు కనిపించడం లేదు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బుమ్రాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో ఇండియా ఒక టెస్టు నెగ్గి, ఓ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకొని.. ఓ దశలో సిరీస్‌‌‌‌‌‌‌‌ను సమం చేసుకునే దిశగా వెళ్లిందంటే అందుకు ఏకైక కారణం  బుమ్రానే. కానీ, తను లేకపోతే జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో  ఐదో టెస్టు.. ఆఖరి ఇన్నింగ్సే ఉదాహరణ. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌‌‌‌‌లో కూర్చోగా.. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోలేకపోయిన ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఓడింది. 

ఒకవేళ బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి కచ్చితంగా భిన్నంగా ఉండేదని ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఒప్పుకున్నారు. ప్రస్తుతం టీమిండియాలోని ఫాస్ట్ బౌలర్లలో  బుమ్రా స్థాయిలో సగాన్ని కూడా ఎవ్వరూ అందుకోలేకపోవడం శోచనీయం. హైదరాబాదీ  మహ్మద్ సిరాజ్ 36 టెస్టుల్లో వంద వికెట్ల క్లబ్‌‌‌‌‌‌‌‌లో చేరినా.. అతను ఇంకా గేమ్ ఛేంజర్‌‌‌‌‌‌‌‌గా మారలేదు. సిరీస్ మొత్తంలో సెకండ్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పటికీ ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో వికెట్ల వేట కొనసాగించిన బుమ్రాకు సరైన సహకారం అందించలేకపోయాడు. 

ఇక,  ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తుది జట్టులోకి వచ్చిన ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ పలు సందర్భాల్లో ఆకట్టుకున్నా  అతని బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో నియంత్రణ లోపించింది. చాలా లూజ్ బాల్స్‌‌‌‌‌‌‌‌ వేస్తాడు. హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్ గౌతమ్ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరికోరి ఎంపిక చేసిన హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణాలో  అంత  పస లేదని తేలిపోయింది. ఆకాష్ దీప్,  ముకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్ రూపంలో  మరో ఇద్దరు ప్రతిభావంతులు ఉన్నా.. అత్యుత్తమ స్థాయిలో  రాణించే సత్తా ఉందని వీళ్లు నిరూపించుకోవాల్సి ఉంది. రంజీ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌లోనూ  టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉన్న ఫాస్ట్ బౌలర్లు సెలెక్టర్లకు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ పేసర్ల కొరత జట్టును ఎంతో కాలం నుంచి వేధిస్తోంది.  అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్, యశ్‌‌‌‌‌‌‌‌ దయాల్ రూపంలో  ఆప్షన్లు కనిపిస్తున్నా.. రెడ్ బాల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో  వీళ్లు చాలా మెరుగవ్వాల్సి ఉంది.

ALSO READ : Team India: బుమ్రాను చెరకు రసం పిండినట్లు పిండారు: మాజీ స్పిన్నర్

పోటీలో అరుగురు..

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ విభాగంలో కొంత మంది ప్రతిభావంతులు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ  రోహిత్, కోహ్లీ  టెస్టుల నుంచి రిటైర్ అయినా.. వీరిని పక్కనబెట్టాలని సెలెక్టర్లు భావించినా.. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేయడానికి దాదాపు అరడజను మంది ప్లేయర్లు పోటీలో ఉన్నారు.  ప్రధాన పోటీదారుల్లో తమిళనాడుకు చెందిన బి. సాయి సుదర్శన్ ఒకడు. నాణ్యమైన షాట్లు కొట్టగల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ గతేడాది చివర్లో ఇండియా–ఎ జట్టు తరఫున మకేలో ఆస్ట్రేలియా–ఎపై సత్తా చాటాడు. 

ప్రస్తుత జట్టులోని  మరో లెఫ్టాండ్ స్టైలిష్ బ్యాటర్  దేవదత్ పడిక్కల్ కూడా దమ్మున్న ఆటగాడే. అతనిప్పటికే రెండు టెస్టులు ఆడాడు. మరికొన్ని అవకాశాలు లభిస్తే  సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.  అభిమన్యు ఈశ్వరన్ మూడేండ్లుగా టీమిండియాలో చోటు ఆశిస్తున్నాడు. కానీ, సెనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో  ఎదురయ్యే సవాల్‌‌‌‌‌‌‌‌కు సిద్ధంగా తను లేడని టీమిండియా వర్గాలు భావిస్తున్నాయి. అందుకే బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జట్టుతోనే ఉన్నా.. బరిలోకి దిగే చాన్స్ రాలేదని చెప్పొచ్చు. ఇక  దేశవాళీల్లో దుమ్మురేపి టీమిండియా అరంగేట్రం చేసిన  సర్ఫరాజ్ ఖాన్‌‌‌‌‌‌‌‌లో  టన్నుల కొద్దీ టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉంది.  

ALSO READ : Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?

రంజీ ట్రోఫీ రెండో దశ పూర్తయితే మరో ముగ్గురు బ్యాటర్లు కూడా రేసులోకి రానున్నారు. ఇంకా టెస్టు అరంగేట్రం చేయని రుతురాజ్ గైక్వాడ్, మూడు టెస్టులు ఆడిన రజత్ పటీదార్, సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రెడ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మెప్పించాలని చూస్తున్నారు. అయితే, అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షార్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ సమస్య ఇబ్బంది పెడుతుండగా.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై బరిలోకి దిగిన రజత్ నిరాశ పరిచాడు. రుతురాజ్‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌‌‌‌‌‌‌‌–ఎతో ఇండియా–ఎ ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలయ్యాడు. కానీ, వీరి టాలెంట్‌‌‌‌‌‌‌‌పై ఎవ్వరికీ అపనమ్మకం లేదు. మున్ముందు అవకాశాలు లభిస్తే సత్తా చాటేందుకు వీళ్లంతా  సిద్ధంగా ఉన్నారు.

అలాంటి ఆటగాళ్ల కోసం అన్వేషణ..

సెలెక్షన్ కమిటీ కేవలం ఆటగాళ్లు చేసే పరుగులు, పడగొట్టే వికెట్ల సంఖ్యను మాత్రమే చూడటం లేదు. ఆయా మ్యాచ్‌‌ల్లో జట్టును గెలిపించేందుకు వాళ్లు ఎలా పోరాడుతున్నారనే దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. సవాల్‌‌ విసిరే పిచ్‌‌లపై, ప్రతికూల పరిస్థితుల్లో సత్తా చాటుతున్న వారి కోసం వెతుకుతోంది. ఓ యువ బౌలర్ తన మూడో లేదా నాలుగో స్పెల్‌‌లో పాత బాల్‌‌తో ఎలా బౌలింగ్‌‌ చేస్తున్నాడు? స్పిన్ వికెట్లపై ఓ బ్యాటర్‌‌‌‌ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటున్నాడు? అనే విషయాలను జాగ్రత్తగా గమనిస్తోంది. 

అయితే, తమ దృష్టిలో ఉన్న ఏ ఆటగాళ్లకు తర్వాతి స్థాయిలో అవకాశాలు ఇవ్వాలనే దానిపై  ఫిబ్రవరిలో ముగిసే డొమెస్టిక్ సీజన్‌‌ ముగిసిన తర్వాతే నిర్ణయం తీసుకోనుంది. టీమిండియా తమ తర్వాత టెస్టు సిరీస్‌‌ను జూన్‌‌లో ఇంగ్లండ్‌‌ టూర్‌‌‌‌లో ఆడనుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని  ఏ పరిస్థితుల్లో అయినా మెప్పించే.. ఎలాంటి వాతావరణంలో అయినా జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లను సెలెక్టర్లు టెస్టు జట్టులోకి తీసుకుంటారేమో చూద్దాం!