Jasprit Bumrah: 46 ఏళ్ల రికార్డు బ్రేక్.. తొలి భారత బౌలర్‌గా బుమ్రా

సిడ్నీ టెస్టులో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రెకార్డుల్లోకెక్కాడు. రెండోరోజు ఆటలో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. భారత పేసర్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ 32 వికెట్లు పడగొట్టాడు.

46 ఏళ్ల క్రితం బేడీ.. 

గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బిషన్‌ సింగ్‌ బేడీ పేరిట ఉండేది. 1977/78లో ఆస్ట్రేలియా పర్యటనలో బేడీ  ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొత్తం 31 వికెట్లతో ముగించాడు. ఆ రికార్డును బుమ్రా అధిగమించాడు.

ALSO READ : Rohit Sharma: నేను రిటైర్‌ అవ్వలేదు.. రెస్ట్ మాత్రమే.. మౌనం వీడిన రోహిత్ శర్మ

ఆసీస్ గడ్డపై భారత్ తరఫున టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు

  • జస్ప్రీత్ బుమ్రా: 32* వికెట్లు (2024-25)
  • బిషన్ సింగ్ బేడీ: 31 వికెట్లు (1977-78)
  • భగవత్ చంద్రశేఖర్: 28 వికెట్లు (1977-78)
  • కపిల్ దేవ్: 25 వికెట్లు (1991-92)