IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్ దేవ్ 50 టెస్టుల్లో 200 వికెట్ల మార్కును చేరుకున్నారు. 

బుమ్రా 44 టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాతో కలిసి 200 టెస్టు వికెట్లు తీసిన సంయుక్త రెండో భారత బౌలర్‌గా ఉన్నాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు

  • రవి అశ్విన్: 37 మ్యాచ్‌లు (సెప్టెంబర్ 2016)
  • రవీంద్ర జడేజా: 44 మ్యాచ్‌లు (అక్టోబర్ 2019)
  • జస్ప్రీత్ బుమ్రా: 44 మ్యాచ్‌లు (డిసెంబర్ 2024)
  • హర్భజన్ సింగ్: 46 మ్యాచ్‌లు (సెప్టెంబర్ 2005)
  • అనిల్ కుంబ్లే: 47 మ్యాచ్‌లు (అక్టోబర్ 1998)

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ యాసిర్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. షా కేవలం 33 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇక పేసర్లలో ఆస్ట్రేలియాకు చెందిన డెన్నిస్ లిల్లీ 38 టెస్టు మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పడగొట్టాడు.

Also Read :- లబుషేన్ ఒక్కడే అడ్డు.. హోరాహోరీగా బాక్సింగ్‌ డే టెస్టు

అలాగే, బుమ్రా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా కపిల్ దేవ్‌ను అధిగమించాడు.

  • జస్ప్రీత్ బుమ్రా: 26 వికెట్లు
  • కపిల్ దేవ్: 25 వికెట్లు
  • జస్ప్రీత్ బుమ్రా: 21 వికెట్లు (2018/19)
  • కపిల్ దేవ్: 19 వికెట్లు