బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు కోసం భారత జట్టు బుధవారం (డిసెంబర్ 11) బ్రిస్బేన్ చేరుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ గౌతమ్ గంభీర్ సహా భారత స్టార్ ఆటగాళ్లందరూ బ్రిస్బేన్ విమానాశ్రయం నుండి హోటల్‌కు వెళ్తున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ విమానాశ్రయంలో ఓ అభిమానితో సెల్ఫీకి పోజులిచ్చాడు.
రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్ళు మంగళవారం (డిసెంబర్ 10) అడిలైడ్ లో కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా భారత స్టార్లు ఎక్కువ సేపు చెమటోడ్చారు. విరాట్‌కోహ్లీ, యశస్వి జైస్వాల్, రోహిత్‌శర్మ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. బౌలర్లు ఆకాశ్‌దీప్‌సింగ్, యశ్ దయాల్, హర్షిత్ రానా బౌన్సర్లు సంధించేలా బౌలింగ్ చేశారు. ఇక ఫామ్‌లేమితో నానా ఇబ్బందులు పడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువసేపు నెట్స్‌లో గడిపాడు.
Adelaide ✅
— BCCI (@BCCI) December 11, 2024
Hello Brisbane ?#TeamIndia | #AUSvIND pic.twitter.com/V3QJc3fgfL
గబ్బా కోటలో మంచి రికార్డు
2021 ఆసీస్ పర్యటనలో గబ్బా కోటలో విజయం సాధించడం ద్వారా భారత జట్టుకు బ్రిస్బేన్ గడ్డపై మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. 33 ఏళ్లలో బ్రిస్బేన్ వేదికపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి పర్యాటక జట్టు.. టీమిండియా. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ, భారత్ చివరి ఇన్నింగ్స్‌లో 328 పరుగుల లక్ష్యాన్ని చేధించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 138 బంతుల్లో 89 పరుగులు చేసి, గబ్బాలో కంగారూల గర్వాన్ని అణిచాడు.
డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్:
- మూడో టెస్ట్ (డిసెంబర్ 14- 18): గబ్బా (బ్రిస్బేన్)
- నాలుగో టెస్ట్ (డిసెంబర్ 26- 30): మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (మెల్‌బోర్న్)
- ఐదో టెస్ట్ (జనవరి 03- 07): సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (సిడ్నీ)