చిన్న ఇండ్లపై పెరుగుతున్న ఫోకస్.. తీరనున్న సొంతింటి కల

చిన్న ఇండ్లపై పెరుగుతున్న ఫోకస్.. తీరనున్న సొంతింటి కల
డెవలపర్ల చూపు చౌక ఇండ్ల వైపు.. కరోనా తర్వాత పెరిగిన డిమాండ్ టాప్ సిటీల్లో కొత్తగా 7.7 లక్షల ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో బూస్టప్ పదింతలు పెరిగిన లాంచ్‌‌లు బిజినెస్ డెస్క్, వెలుగు: గత ఐదేళ్ల నుంచి స్లోడౌన్‌‌లో ఉన్న ఇండియన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్‌‌కు అఫర్డబుల్ హౌసింగ్ సపోర్ట్‌‌గా నిలుస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత కూడా డెవలపర్లు ఎక్కువగా  అఫర్డబుల్ హౌసింగ్‌‌పైనే ఫోకస్ పెట్టారు. ఈ సెగ్మెంట్లోకి మరింత మంది డెవలపర్లు ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. లియసిస్ ఫోరాస్ డేటా ప్రకారం 2023 చివరి నాటికి టాప్ 7 సిటీల్లో రూ.45 లక్షల కంటే తక్కువ విలువ చేసే ఇండ్లు కొత్తగా 7.7 లక్షలకు పైగా యాడ్ అవుతాయని వెల్లడైంది. వీటిలో ఎక్కువగా ఢిల్లీ ఎన్‌‌సీఆర్‌‌‌‌లలో లాంచ్ అవుతాయని, ఆ తర్వాత ముంబైలో ఉంటాయని పేర్కొంది. సగానికి పైగా కొత్త అఫర్డబుల్ ఇండ్లు ఈ రెండు సిటీల్లోనే ఉంటాయని తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వడ్డీ సబ్సిడీని, ఇండ్లు కొనేవారికి, డెవలపర్లకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రయోజనాలను ప్రకటించిన తర్వాత అఫర్డబుల్ హౌసింగ్ పెరుగుతూ వస్తోందని లియసిస్ ఫోరాస్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ చెప్పారు. వచ్చే రెండేళ్ల వరకు అఫర్డబుల్ హౌసింగ్ అనేదే కీలకంగా మారనుందని, చాలా మంది డెవలపర్లు ఈ సెగ్మెంట్‌‌ వైపుకే ఎక్కువగా చూడనున్నారని తెలిపారు. మరోవైపు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ మాత్రం తీవ్ర సంక్షోభంలో పడింది. 2016లో పాత నోట్లను రద్దు చేసిన తర్వాత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ బాగా దెబ్బతింది. ఇంకా రెరా, జీఎస్టీ లాంటి సంస్కరణలు ఈ రంగాన్ని ఇబ్బందుల్లో పడేశాయి. వాటి నుంచి ఇంకా కోలుకోకముందే కరోనా వచ్చి మరింత ప్రమాదంలోకి నెట్టేసింది. ఉద్యోగాలు, వేతన కోతలతో కొనుగోళ్ల శక్తి తగ్గింది. అయితే ప్రభుత్వం ప్రకటిస్తోన్న ఇన్సెంటివ్‌‌లు అఫర్డబుల్ హౌసింగ్‌‌కు ఒక అవకాశంగా నిలుస్తున్నాయి. కరోనాకు ముందు కూడా రూ.45 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్‌‌మెంట్లకు డిమాండ్ ఉండేది. ప్రధానమంత్రి ‘హౌసింగ్ ఫర్ ఆల్’ తో వీటికి బూస్టప్ వచ్చింది. లియసిస్ ఫోరాస్ డేటా ప్రకారం గత ఆరేళ్లలో ఈ కేటగిరీ ప్రాజెక్ట్‌‌లలోనే 46 శాతం యూనిట్లు ప్రారంభమయ్యాయి. గత ఆరేళ్లలో తక్కువ కాస్ట్ ఉన్న ప్రాజెక్ట్‌‌ల లాంచ్‌‌లు ఢిల్లీ ఎన్‌‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, చెన్నై వంటి ప్రాంతాల్లో ఎనిమిది నుంచి పదింతలు పెరిగాయి. వీటిలో ఎక్కువగా ముంబైలో లాంచ్ అయ్యాయి. డ్రీమ్ హోమ్‌‌కు బదులు.. ఎండ్ యూజర్ల అవసరాలకు ఇండ్లను డెవలపర్లు డిజైన్ చేస్తున్నట్టు కపూర్ తెలిపారు.   పీఎంఏవై స్కీమ్ కింద అఫర్డబుల్ హోమ్ అంటే రూ.45 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్‌‌మెంట్ లేదా ఇల్లు. మెట్రోల్లో 60 చదరపు మీటర్లు. నాన్ మెట్రోల్లో 90 చదరపు మీటర్లు కూడా అఫర్డబుల్ హౌసింగ్ కిందకు వస్తాయి. పన్ను ప్రయోజనాలతో ప్రభుత్వం సపోర్ట్… అఫర్డబుల్ యూనిట్లలో ఒక్కో యూనిట్ కాస్ట్ ఇతర వాటితో పోలిస్తే తక్కువగా ఉంటాయని డెవలపర్ లాబీ నారేడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హీరానందని చెప్పారు. కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ డెవలపర్లు అఫర్డబుల్ హోమ్స్ వైపుకి చూస్తున్నట్టు తెలిపారు. పన్ను ప్రయోజనాలతో అఫర్డబుల్ హౌసింగ్‌‌కు ప్రభుత్వం సపోర్ట్ ఇస్తున్నట్టు చెప్పారు. ఈ సెగ్మెంట్‌‌లో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ప్రభుత్వం కేవలం 1 శాతం జీఎస్టీనే విధిస్తోంది. మిగిలిన మార్కెట్ అంతా 8 శాతంగా ఉంది.   అంతేకాక అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌‌లకు చాలా వేగంగా ప్రభుత్వం పర్మిషన్లను, క్లియరెన్స్‌‌లను అందిస్తోందని హీరానందని అన్నారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌‌లకు సెక్షన్ 80 ఐబీఏ కింద ప్రాపర్టీలో 100 శాతం డిడక్షన్‌‌ను కల్పించడం డెవలపర్లకు అందిస్తోన్న మేజర్ ప్రోత్సాహకాల్లో ఒకటని నిసస్ ఫైనాన్స్ సీఈవో, ఎండీ అమిత్ గోయెంకా తెలిపారు. మిడ్–లగ్జరీ హోమ్స్ ఉన్న డెవలపర్లు కూడా అఫర్డబుల్ హౌసింగ్‌‌లోకి అడుగుపెడుతున్నట్టు చెప్పారు. అర్బనైజేషన్ అఫర్డబుల్ హౌసింగ్ డిమాండ్‌‌ను పెంచుతోంది. పట్టణాలకు తరలి వచ్చే ప్రజలు వెంటనే వారు నివసించేందుకు తక్కువ రేట్ ఇండ్ల కోసం చూస్తున్నారు. – విమలేంద్ర సింగ్, చీఫ్ సేల్స్ ఆఫీసర్, మహీంద్రా లైఫ్‌‌ స్పేసస్ ‘కాగయ్’ ప్రాపర్టీ ఫ్లాష్ సేల్… ఇండియాలో తొలి గేమిఫైడ్ రియాల్టీ సేల్స్ మొబైల్ యాప్ ‘కాగయ్’ తన తొలి ప్రాపర్టీ ఫ్లాష్ సేల్‌ను నిర్వహిస్తోంది. కాగయ్ మొబైల్ యాప్‌పై జనవరి 2021లో ఈ సేల్ ఉండనుంది. తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ ఎన్‌సీఆర్, మహారాష్ట్రలలో 10 వేలకు పైగా ఇన్వెంటరీని ఈ సేల్‌లో ఉంచనున్నారు. రియల్ ఎస్టేట్‌లో అనూహ్యమైన ఆఫర్లను అందుకోవడానికి గృహకొనుగోలుదారులకు లైఫ్‌టైమ్‌లో వచ్చే ఒకే ఒక్క అవకాశమని కాగయ్ చెబుతోంది. మీ సొంతిటి కలను సాకారం చేసుకోవచ్చని పేర్కొంటోంది. For More News.. ‘ములాగ్‌’ మెడల్‌ సాధించిన ఏకైక క్రికెటర్ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మంచిదేనా? ఏమైనా రిస్క్ ఉందా? న్యూఇయర్ ఆఫర్: అమెజాన్‌‌‌‌‌‌‌‌లో ‘మెగా శాలరీ డేస్‌‌‌‌‌‌‌‌’