సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వాటర్​ఫ్లో

సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్​ఫ్లో 19,141 క్యూసెక్కులు ఉండగా, ఔట్​ ఫ్లో 14,141 క్యూసెక్కులుగా ఉంది. 29.40 టీఎంసీలు ప్రసుత్తం ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండగా, పూర్తిస్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు. జల విద్యుత్​కేంద్రంలో విద్యుత్​ఉత్పత్తి కొనసాగుతుంది. పెరిగిన వాటర్​ఫ్లో వల్ల ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు, రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ALSO READ | వ్యక్తిగత అజెండా లేదు.. లేక్స్‎ను కాపాడటమే లక్ష్యం: డిప్యూటీ CM భట్టి