న్యూఢిల్లీ : టాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం బుధవారం ఊరటనిచ్చే కబురు చెప్పింది. రూ 5 లక్షల వరకూ పెండింగ్‌లో ఉన్న అన్ని ఐటీ రిఫండ్స్‌ను వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. అదేవిధంగా జీఎస్టీ, కస్టమ్ రిఫండ్స్‌నూ వెంటనే చెల్లించాలని నిర్ణయించడం వల్ల సుమారు లక్షల మంది వ్యాపారులకు ప్రయోజనం లభించనుంది. 18 వేల కోట్ల పన్ను రిఫండ్లను ప్రభుత్వం చెల్లించనున్నట్టు ఫైనాన్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన ప్రకటన వివరించింది.
