శశికళకు చెందిన రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు ఫ్రీజ్

శశికళకు చెందిన రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు ఫ్రీజ్

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు ఆత్మీయురాలైన వీకే శశికళకు చెందిన ఆస్తులను ఇన్‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ స్తంభింపజేసింది. బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద శశికళకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులను బుధవారం ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. ఈ ఆస్తుల్లో రూ.300 కోట్ల విలువైన రెండు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సిరుత్తవూర్, కోడనాడులో ఉన్న ఆ ప్రాపర్టీలు జయలలితకు ఆప్తులైన శశికళ, ఇళవరసి, సుధాకరన్ పేర్లపై ఉన్నాయని సమాచారం. సదరు ప్రాపర్టీల దగ్గర ఐటీ శాఖ నోటీసులను అతికించింది. ‘మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళలకు చెందిన కోడనాడ్, సిరుత్తవూర్‌‌లోని ఆస్తులను ఇన్‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ అటాచ్ చేసింది. స్థంభింపజేసిన ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు’ అని ఇన్‌‌కమ్ ట్యాక్స్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.