సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు

వంగూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వంగూరు, చారకొండ, మండలాలకు చెందిన బీఆర్ఎస్ ఎంపీపీలు భీమమ్మ, లాలు యాదవ్, గుండె నిర్మల, విజేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, చారకొండ వెంకటేశ్​ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు రెండు మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.