వీధి కుక్కల దాడిలో చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అద్రాస్ పల్లి గ్రామంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కుమ్మరి కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు అటాక్ చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చిన్నారిని నారాయణగూడలోని ఓ హాస్పిటల్ కి తరలించారు. 

గతంలోనూ గ్రామంలోని చిన్నారులపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. కాలనీలో వందలాది వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.